Watermelon Crop : పుచ్చకాయ పంటను ఆశించే ఎర్ర నల్లి పురుగులను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

పుచ్చకాయ సాగుకు వేసవికాలం చాలా అనుకూలంగా ఉంటుంది.అయితే ఏడాది పొడవునా సాగు చేసేందుకు అనువైన రకాలు రావడం వల్ల రైతులు పుచ్చకాయ సాగుపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతులు ఒకేసారి కాకుండా కొన్ని రోజుల వ్యత్యాసంతో విత్తుకోవాలి.

ఇలా చేస్తే మార్కెటింగ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. """/" / పుచ్చకాయ సాగు బోదెల పద్ధతి లేదంటే ఎత్తు బెడ్ల పద్ధతి ద్వారా చేయవచ్చు.

అయితే విత్తనం విచ్చేటప్పుడు జిగ్ జాక్ పద్ధతి అనుసరించి ఎత్తుబెడ్లకు లేదంటే బోదెకు రెండు వైపుల మొక్కల మధ్య 70 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

"""/" / పుచ్చ కాయ సాగు మల్చింగ్ మరియు డ్రిప్ పద్ధతి( Drip Method ) ద్వారా సాగు చేస్తే దిగుబడులు పెంచుకోవచ్చు.

పైగా కలుపు సమస్య పెద్దగా ఉండదు.వేసవికాలంలో డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించడం చాలా సులువుగా ఉంటుంది.

పంటకు కావలసిన పోషక ఎరువులు కూడా సులభంగా అందించవచ్చు.ఇక పుచ్చకాయ విత్తనం నాటిన 48 గంటల్లోపు ఒక లీటరు నీటిలో ఐదు మిల్లీలీటర్ల పెండిమిథలిన్ ను కలిపి పిచికారి చేస్తే కలుపు సమస్య చాలా వరకు నిర్మూలించబడుతుంది.

పుచ్చకాయ పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే ఎర్రనల్లి పురుగులు కీలకపాత్ర పోషిస్తాయి.

పొడి వాతావరణ పరిస్థితులలో ఈ పురుగులు పంటను ఆశించే అవకాశం చాలా ఎక్కువ.

ఈ పురుగులను పొలంలో గుర్తించడం చాలా కష్టం.ఎందుకంటే ఈ పురుగులు ఆకు యొక్క అడుగు బాగాన ఆవాసాలు ఏర్పరచుకొని ఆకు రసాన్ని పీల్చి పంటకు నష్టం కలిగిస్తాయి.

కాబట్టి పంట పొలంలో వీటిని గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఒక లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల ప్రోపర్ గైడ్ ను కలిపి పిచికారి చేయాలి.

సిటీ లైఫ్ అంత డేంజరా.. ద్వీపంలో 32 ఏళ్లు బతికిన వ్యక్తి.. తిరిగొచ్చిన కొన్నేళ్లకే..?