Sorghum Crop : జొన్న పంటను ఆశించే మొగి పురుగులను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

జొన్న పంట( Sorghum Crop ) ఖరీఫ్ మరియు రబీ కాలాలలో అనువైన పంట.

నీరు నిల్వ ఉండని నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు, చౌక నేలలు జొన్న పంట సాగుకు చాలా అనుకూలం.

జొన్న పంటలు అధిక దిగుబడులు సాధించాలంటే తెగులు నిరోధక మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

CSH-16, నంద్యాల తెల్ల రకం, పాలెం-2 రకాలు అధిక దిగుబడులు( High Yields ) ఇస్తాయి.

ఏ పంట సాగు చేసిన చీడపీడల, తెగుళ్ల బెడద కచ్చితంగా ఉంటుంది.కాబట్టి వీటి వ్యాప్తి తక్కువగా ఉండి మొక్కలు ఆరోగ్యకరంగా పెరగాలంటే మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

"""/" / ఒక ఎకరాకు నాలుగు కిలోల జొన్న విత్తనాలు అవసరం.ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల కార్బండిజమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

లేదంటే 3 గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.జొన్న పంటకు అందించాల్సిన పోషక ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే.

ఒక ఎకరాకు 35 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 10 కిలోల పోటాష్ ఎరువులు అవసరం.

నత్రజని( Nitrogen )ని ఒకేసారి కాకుండా రెండు సమభాగాలుగా చేసుకుని విచ్చేటప్పుడు ఒకసారి పంట మోకాలు ఎత్తుకు పెరిగినప్పుడు రెండోసారి వేసుకోవాలి.

"""/" / జొన్న పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే మొగి పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ పురుగులు మొక్క మొగిను ఆశిస్తాయి.దీంతో మొగి లోపల కుళ్ళిపోయిన వాసన రావడం జరుగుతుంది.

ఈ మొగి పురుగులను పంట పొలంలో గుర్తించిన తర్వాత ఒక లీటరు నీటిలో 1.

5గ్రా.థయోడికార్బ్ ను కలిపి పిచికారి చేయాలి.

పురుగులు ఆశించకుండా ముందస్తు చర్యలలో భాగంగా విత్తనం విత్తుకునే ముందు కార్బొఫ్యురాన్ గుళికలు విత్తనంతో పాటు కలిపి వేసుకోవాలి.

రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిది.. సీఎం రేవంత్ కు సీపీఐ సూచన