క్యారెట్ పంట సాగులో నాణ్యమైన దిగుబడి కోసం యాజమాన్య పద్ధతులు..!

క్యారెట్ పంట( Carrot Cultivation )ను శీతాకాలపు పంటగా చెప్పుకోవచ్చు.మిగతా కాలాలతో పోలిస్తే శీతాకాలంలో క్యారెట్ అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.

క్యారెట్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్న క్యారెట్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.

కాబట్టి ఈ పంట ఏడాది పొడవునా రైతులు సాగు చేస్తున్నారు.ఉష్ణోగ్రత 18 నుంచి 24 డిగ్రీల మధ్య ఉండే వాతావరణంలో క్యారెట్ పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు.

అందుకే శీతాకాలంలో అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.నవంబర్ వరకు క్యారెట్ పంటను విత్తుకోవడానికి సమయం ఉంటుంది.

క్యారెట్ సాగు చేసే రైతులు( Farmers ) ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

"""/" / క్యారెట్ పంటకు( Carrot Cultivation ) మనం అందించే పోషక యాజమాన్యం పైనే వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుంది.

కాబట్టి ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు నత్రజని, భాస్వరం, పోటాష్ ఎరువులను వేసి కలియ దున్నుకోవాలి.

పంట విత్తిన ఆరువారాల తర్వాత మళ్లీ నత్రజని ని డ్రిప్ వసతి ఉండే రైతులు ( Farmers )అయితే ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించాలి.

లేదంటే నత్రజనిని పొలంలో చల్లుకోవాలి.నీటిని సాధారణ పద్ధతిలో కాకుండా డ్రిప్ విధానం ద్వారా అందిస్తే నీరు ఆదా అవ్వడంతో పాటు కలుపు సమస్య చాలావరకు తక్కువగా ఉంటుంది.

"""/" / ఈ పంటకు ఆకుపచ్చ, ఆకుమాడు, బూడిద తెగుళ్లు( Pests ) ఆశిస్తే తొలి దశలో అరికట్టకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.

వీటితోపాటు ఆకుతినే పురుగులు, రసం పీల్చే పురుగుల బెడద కూడా చాలా ఎక్కువే.

పంట విత్తిన తర్వాత పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ సంరక్షక చర్యలు పాటించాలి.క్యారెట్ పంట విత్తిన 90 రోజులకు చేతికి వస్తుంది.

క్యారెట్ మొక్క ఆకులు పండు బారి ఎండిపోతే పంట కోతకు సిద్ధం అయినట్టే.

పంట కోసిన వెంటనే మార్కెట్ కు తరలిస్తే అధిక ధర పలుకుతుంది.

ఇష్టం లేకపోయినా అలాంటి సీన్లలో నటించిన హీరోయిన్లు.. ఎవరంటే..