ప్రత్తి పంటలో వేరు కుళ్ళు తెగుళ్ల నివారణ కోసం యాజమాన్య పద్ధతులు..!
TeluguStop.com
ప్రత్తి పంట( Cotton Crop ) ప్రధాన వాణిజ్య పంట.ప్రత్తిని తెల్ల బంగారం అని కూడా అంటారు.
అయితే పత్తి పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువే.ఈ పంట సాగు విధానంపై అవగాహన లేకుండా సాగు చేస్తే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.
ఇక ఈ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ళ విషయానికి వస్తే వేరు కుళ్ళు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ తెగుళ్లు ఒక శిలీంద్రం ద్వారా అంటను ఆశిస్తాయి.ఈ శిలీంద్రం మట్టిలో ఉండే అవశేషాలు జీవించి ఉంటుంది.
పత్తి మొక్కలు క్రమంగా ఎండిపోతున్నాయి అంటే ఆ మొక్కలకు వేరు కుళ్ళు తెగుళ్లు ఆశించినట్టే.
మొక్కల ఆకులు రాలిపోవడం, మొక్కలు నేల ఒరగడం, మొక్కలు అర్ధాంతరంగా పూర్తిగా ఎండిపోవడం ఈ తెగుళ్ళ ముఖ్యమైన లక్షణాలు.
ఈ తెగుళ్లు సోకితే మొక్క పై భాగాలకు నీరు పోషకాలు చేరవు.ఇక మొక్క తన స్థిరత్వాన్ని కోల్పోతుంది.
మొక్క క్రమంగా పసుపు రంగులోకి మారుతుంది. """/" /
తెగులు నిరోధక సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలను( Pest Resistant Certified Company Seeds ) ఎంపిక చేసుకుని సాగు చేయాలి.
మొక్క పుష్పించే దశలో పొడి వాతావరణం ఉండకుండా విత్తే తేదీని సర్దుబాటు చేయాలి.
అధిక మోతాదులో ఒకేసారి నత్రజనిని వాడకూడదు.పంట కోతల అనంతరం పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాలను పూడ్చి పెట్టాలి.
గోధుమలు, వరి, బార్లీ లాంటి వాటితో పంట మార్పిడి చేయాలి. """/" /
ఇక వేరు కుళ్ళు తెగుళ్ల లక్షణాలు పంట పొలంలో గుర్తించిన తర్వాత ఆ మొక్కలను పీకేసి నాశనం చేయాలి.
రసాయన పిచికారి మందులైన థైరామ్, జింక్ సల్ఫేట్, కప్టాన్ లాంటి శిలీంద్ర నాశినులను ఉపయోగించి ఈ వేరు కుళ్ళు తెగుళ్లను వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో నిరోధించవచ్చు.
పుష్ప 2 విషయం లో అతి జాగ్రత్త మొదటికే మోసం వస్తుందా..?