చిక్కుడు పంటలో తుప్పు తెగుల నివారణకు యాజమాన్య పద్ధతులు..!
TeluguStop.com
చిక్కుడు తీగజాతి కూరగాయలలో ఒకటి.చిక్కుడులో మంచి పోషకాలు ఉంటాయి.
కాబట్టి మార్కెట్లో చిక్కుడుకు మంచి డిమాండ్ ఉంటుంది.చిక్కుడుకు తుప్పు తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.
ఈ తెగుళ్లను గుర్తించి తొలి దశలోనే అరికట్టడం, లేదంటే తెగుళ్లు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల చిక్కుడులో ( Cluster Beans Cultivation )అధిక దిగుబడి సాధించవచ్చు.
ఈ తుప్పు తెగుళ్లు మట్టిలో ఉన్న మొక్కల అవశేషాల్లో జీవిస్తాయి.మొక్కల అవశేషాలు లేకుండా ఈ తుప్పు తెగుళ్ళకు చెందిన శిలీంద్రాలు జీవించలేవు.
అధిక తేమ లేదా అధిక ఉష్ణోగ్రత ఉండే పొలాల్లో ఈ తుప్పు తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.
"""/" /
ఈ తెగుళ్లు పంటను ఆశిస్తే.మొక్క ఆకులపై గోధుమ రంగు నుండి పసుపు రంగు బుడిపెలు ఏర్పడతాయి.
ఆ తర్వాత ఈ తెగుళ్లు మొక్క కాండం, కాడలు, కాయలపై వ్యాపిస్తాయి.ఆ తర్వాత మొక్క ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.
ఈ తెగుళ్ల ప్రభావం పంట దిగుబడిపై అధికంగా ఉంటుంది.తుప్పు తెగులు సోకితే చిన్న మొక్కలు త్వరగా చనిపోతాయి.
పెద్ద మొక్కలు చనిపోవు కానీ దిగుబడిపై ప్రభావం పడుతుంది.ఈ తెగుళ్లను ముందుగా సేంద్రీయ పద్ధతిలో నివారించే ప్రయత్నం చేయాలి.
బాసిల్లస్, సబ్టిలిస్ లాంటి జీవ కీటక నాశనులు ఈ తెగుళ్ల వ్యాప్తిని నియంత్రిస్తాయి.
"""/" /
ఒకవేళ పంట చెయ్యి దాటిపోతుంది అనుకుంటే త్రయాజోల్, స్ట్రోబిల్లురిన్ లాంటి శిలీంద్ర నాశినులను పిచికారి చేసి తొలి దశలోనే ఈ తెగుళ్లను అరికట్టాలి.
పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించిన వాటిని తొలి దశలోనే అరికట్టిన దిగుబడిపై కాస్తయినా ప్రభావం పడుతుంది.
కాబట్టి పంటకు తెగులు సోకకుండా ముందుగానే సంరక్షక చర్యలు పాటించాలి.తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి.
తెగులు సోకిన ప్రదేశాల్లో మొక్క నాటకూడదు.పంటలు అక్కడక్కడ మొక్కజొన్న విత్తనాలు నాటాలి.
వ్యాధి సోకిన మొక్కలను పీకేసి కాల్చి నాశనం చేయాలి.పంట అనంతరం అవశేషాలను పొలం నుంచి తీసేసి నాశనం చేయాలి.
ఒక ఆకులపై అధిక సమయం తేమ లేకుండా చూసుకోవాలి.మోతాదుకు మించి నత్రజని ఉపయోగించకూడదు.
షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!