పామ్ ఆయిల్ తోటల్లో అధిక దిగుబడి కోసం యాజమాన్య సూచనలు..!

భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లో పామ్ ఆయిల్)( Oil Palm ) తోటలు సాగవుతున్నాయి.

కొన్ని యాజమాన్య సూచనలను పాటిస్తే ఎకరాకు దాదాపు 15 టన్నుల దిగుబడి పొందవచ్చు.

నీరు నిల్వ ఉండని ఎటువంటి నేలలైన ఈ పంట సాగుకు అనుకూలం.ఒకవేళ ఇసుక భూములలో అయితే నీటి వసతి కచ్చితంగా ఉండాల్సిందే.

ఈ పంటకు దళారుల బెడద ఉండకపోవడంతో మంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఈ పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతోంది.

ఇక రాయలసీమలోని అనంతపురంలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు.

పైగా ఈ పంటపై సబ్సిడీలు, రాయితీలు ఉండడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు.

ఈ పంట వేసిన మూడు సంవత్సరాల నుండి దిగుబడిని పొందవచ్చు.కానీ మొదటి మూడు సంవత్సరాలు పంటకు మంచి ఎరువులు అందించడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడి అధికంగా ఉంటుంది.

పంట వేశాక చెట్ల వయసును బట్టి ఎరువుల వాడకం ఉంటుంది.ఈ పంట సాగులో ఎక్కువగా సూక్ష్మ పోషక దాతు లోపాలు ఏర్పడతాయి.

కాబట్టి ఈ సమస్యను అధిగమించడం కోసం ఏడాదిలో రెండుసార్లు బోరాన్ మెగ్నీషియం( Boran Magnesium )ను పంటకు అందించాలి.

"""/" / ఈ పంట వేసిన మొదటి రెండు సంవత్సరాల్లో లోపు ఏవైనా అంతర పంటలను కూడా సాగు చేయవచ్చు.

తోటలో నరికిన చెట్ల ఆకులను మల్చింగ్ చేస్తే అవి కుళ్లి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి.

ఇక క్రమం తప్పకుండా నీటి తడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.చెట్లు ఎంత బలంగా పెరుగుతాయో అంతే రీతిలో నాణ్యమైన అధిక దిగుబడి( High Yield ) ఉంటుంది.

కాబట్టి పంట సాగులో మెళుకువలు తెలుసుకొని పాటిస్తే ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకు అధిక దిగుబడి పొందవచ్చు.

బాబు గారి నిర్ణయం :  ఏపీలో ఇసుక ఫ్రీ ఫ్రీ