వేములవాడలో అన్నదాన సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం( Sri Raja Rajeshwara Swami Temple ) సన్నిధిలో అన్నదానం సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ( Aadi Srinivas)ఆదేశించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని శివార్చన మండపంవద్ద సత్రం నిర్మాణానికి స్థలాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ ఈఓ వినోద్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడారు.బీసీ అండ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తాను ఇటీవల స్వామి వారి దర్శనం సందర్భంగా చేసిన ప్రకటనలో భాగంగా ఈ రోజు స్థల పరిశీలన చేశామని తెలిపారు.

రాజన్న భక్తులకు సులభంగా వేగంగా దర్శనం, వసతి ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

బ్రేక్ దర్శనం అమలు చేస్తునామని తెలిపారు.అలాగే భక్తులకు నిత్యం అన్న దానం అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

రోజు 15,000 మంది భోజనం చేసేలా భవనాన్ని నిర్మించెలా ప్రతిపాదనలు రూపొందించాలని, ఈ శనివారం లోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక్కడ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్,ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఈ ఈ రాజేష్ డి ఈ రఘునందన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ఎడ్ల శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలకు అన్యాయం జరిగితే కోపం వస్తుంది.. బన్నీ సంచలన వ్యాఖ్యలు వైరల్!