Turmeric Crop : పసుపు పంటలో సరైన పోషక ఎరువుల యాజమాన్యం..!

పసుపు పంటకు( Turmeric Crop ) మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.

కాకపోతే పసుపు పంట సాగు విధానంపై అవగాహన లేకుండా సాగు చేస్తే పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు శ్రమ కూడా పెరుగుతుంది కానీ చివరకు ఆశించిన స్థాయిలో దిగుబడులు మాత్రం పొందలేము.

కాబట్టి పసుపు పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకున్న తర్వాతనే సాగు చేపట్టాలని వ్యవసాయ క్షేత్ర నిపుణుల( Agricultural Experts ) సూచన.

నాణ్యమైన పసుపు గడ్డలు ఊరడానికి అనువుగా ఉండాలంటే, పసుపు పంట సాగు చేసే నేలను లోతు దుక్కులు దున్నుకున్న తర్వాత నేలను వదులుగా అయ్యేలా దమ్ము చేసుకోవాలి.

"""/" / పసుపు పంటలు అత్యంత కీలకం సరైన పోషక ఎరువుల యాజమాన్యం.

పసుపు పంటలో నాణ్యమైన గడ్డ కోసం పోషక ఎరువుల అవసరం చాలా ఎక్కువ.

కాబట్టి వేసవి కాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకున్నాక, ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 15 టన్నుల పశువుల ఎరువు ( Cattle Manure ) వేసి కలియదున్నాలి.

పశువుల ఎరువు దొరకకపోతే, ఒక ఎకరాకు 200 కిలోల వేప పిండి, కానుగపిండి చివరి దుక్కిలో వేసుకోవాలి.

లేదంటే 200 కిలోల సూపర్ ఫాస్పేట్ మరియు ఆముదం పిండిని కలుపుకొని వేసుకోవాలి.

"""/" / వీటితో పాటు చివరి దుక్కిలో జింక్ సల్ఫేట్ ( Zinc Sulphate )కూడా వేసుకోవాలి.

ఇక పసుపు పంట నాటిన 35 రోజుల తర్వాత ఒక ఎకరాకు 50 కిలోల యూరియా 200 కిలోల వేపపిండి కలిపి వేసుకోవాలి.

పసుపు పంటకు వివిధ రకాల తెగుళ్లు నేల నుంచి ఆశించకుండా ఉండాలంటే విత్తన శుద్ధి చేయాలి.

విత్తన శుద్ధి చేస్తే దుంప కుళ్ళు తెగుళ్లను రాకుండా నివారించవచ్చు.రెండు మిల్లీ లీటర్ల డైమిథోయేట్ ను ఒక లీటరు నీటిలో కలిపి, ఆ ద్రావణంలో ఓ 30 నిమిషాల పాటు పసుపు దుంపలను ఉంచి ఆ తర్వాత పొలంలో విత్తుకోవాలి.

లేదంటే 1.5 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ ను ఒక లీటర్ నీటిలో కలిపి, ఆ ద్రావణంలో పసుపు దుంపలను ఒక 30 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత పొలంలో విత్తుకోవాలి.

పుష్ప 2 లో ఫాహాద్ ఫజిల్ క్యారెక్టర్ ను సుకుమార్ పట్టించుకోవడం లేదా..?