ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కార దిశగా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.
ఎస్.లతతో కలసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజాసమస్యలపై ప్రజావాణి కార్యక్రమం తప్పక నిర్వహించాలని,అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు.
జిల్లాలోని జిపిలు,మున్సిపాలిటీల్లో ఎప్పడికప్పుడు పారిశుద్ద్య పనులు చేపట్టాలని, దోమల నివారణకై ఫాగింగ్ చేపట్టాలని సూచించారు.
జిల్లాలో ప్రతి కార్యాలయ పరిధిలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని,ఉద్యోగులు, సిబ్బంది సమయాపాలన పాటించాలని,అలాగే మూమెంట్ రిజిస్టర్,సెలవుల రిజిస్టర్ తప్పక నిర్వహించాలని సూచించారు.
జిల్లా స్థాయి ప్రజావాణిలో ఎక్కువగా భూములపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నందున అట్టి దరఖాస్తులను ఆయా మండల తహశీల్దార్లకు సత్వర చర్యలకై పంపించడం జరుగుతుందని,ఆ దరఖాస్తులు వెంటనే పరిష్కారించాలని,కానిపక్షంలో దరఖాస్తుదారునికి తెలపాలని సూచించారు.
ప్రజావాణిలో భూ సమస్యలపై 39,డిఆర్డీఓ 17,డిడబ్ల్యూఓ 7,ఇతర శాఖలకు సంబంధించి 16, మొత్తం 79 దరఖాస్తులు అందగా సంబంధిత శాఖల వారీగా తదుపరి చర్యలకై పంపించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సిపిఓ కిషన్,డిఈఓ అశోక్, డిడబ్ల్యూఓ వెంకటరమణ, సంక్షేమ అధికారులు శంకర్, అనసూర్య,జగదీశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.