ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.
సత్య ప్రసాద్ తొ కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు.
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి, అట్టి దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు.
కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 37 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
Vegas Aces Bonuses And Promotions (UK) – A Practical Value Assessment