మానసిక వ్యాధులు, క్యాన్సర్‌పై పరిశోధనలు: ఇండో అమెరికన్ వైద్యుడికి ప్రతిష్టాత్మక పురస్కారం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళుతున్న భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిలో వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా వున్నారు.తమ అసాధారణ ప్రతిభతో ఆశ్రయం కల్పించిన దేశంతో పాటు జన్మభూమికి సైతం గర్వకారణంగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో ఎన్నో అత్యున్నత పురస్కారాలను సైతం సొంతం చేసుకుంటున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన వైద్యుడికి ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కింది.

చికాగో నగరంలో స్థిరపడిన డాక్టర్ తపన్ పారిఖ్‌ను ‘ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఐఏఎంఏ ) యంగ్ ఫిజిషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌’ కు ఎంపిక చేసింది.

చైల్డ్ సైకాలజీలో విశేష అనుభవం వున్న ఆయన కోవిడ్ 19 మహమ్మారి సమయంలో విస్తృత సేవలు అందించారు.

కరంసాద్‌లోని ప్రముఖ్ స్వామి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పట్టా పొందిన డాక్టర్ తపన్.

గుజరాత్ రాష్ట్రం వడోదరా నగరంలో పుట్టి పెరిగారు.కరేలిబాగ్‌లోని బ్రైట్ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు చదివారు.

అనంతరం ఉన్నత చదువుల కోసం 2008లో అమెరికాకు వెళ్లిన తపన్.పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీని చేశారు.

రోవాన్ యూనివర్సిటీలోని కూపర్ మెడికల్ స్కూల్ నుంచి జనరల్ సైకియాట్రీలో రెసిడెన్సీ చేశారు.

అలాగే కార్నెల్ యూనివర్సిటీలో క్యాన్సర్ మహమ్మారిపై ఎన్నో పరిశోధనలు చేశారు.అనంతరం నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో చైల్డ్ సైకాలజీలో ఫెలోషిప్ చేశారు.

తపన్ పారిఖ్ ప్రస్తుతం చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని ఫిన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.

చికాగోలోని ఆన్ అండ్ రాబర్ హెచ్ లూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో సైకియాట్రీ, బిహేవియర్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అక్యూట్ కేర్ సర్వీసెస్ మెడికల్ డైరెక్టర్‌గా వున్నారు.

ఆయన తన కెరీర్‌లో 50కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు.ఈ సందర్భంగా తపన్ పారిఖ్ స్పందిస్తూ.

వైద్య నిపుణుడిగా స్ధిరపడేందుకు పడిన పోరాటానికి ఈ అవార్డ్ గుర్తింపు అన్నారు.భవిష్యత్తులో పనిచేయడంలో తనకు ప్రేరణనిస్తుందని పారిఖ్ అన్నారు.

"""/"/ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో మానసికంగా ప్రభావితమైన పిల్లలకు సహాయం చేయడానికి చేసిన కృషిని కూడా ఈ అవార్డ్ గుర్తించిందని ఆయన అన్నారు.

కరోనా సమయంలో పిల్లలు చాలా క్లిష్ట పరిస్ధితుల్లో వున్నారని.వారు పాఠశాలకు వెళ్లకుండా తమ వద్దకు రావాల్సి వచ్చిందని పారిఖ్ చెప్పారు.

ఈ సమయంలో కొందరికి మానసిక చికిత్సతో పాటు మందులు కూడా అవసరమవుతాయని ఆయన అన్నారు.

‘గాజు గ్లాస్ ‘ నష్టం తీవ్రంగానే ఉండబోతోందే ? టీడీపీలో వణుకు