మరో తెలుగు సినిమా చేసే ఉద్దేశ్యం లేదన్న బి టౌన్ హీరోయిన్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే( Deepika Padukone ) దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా నిలిచింది.

ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె ఇంగ్లీష్ లో కూడా ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే సమయంలో తెలుగులో ప్రభాస్( Prabhas ) కి జోడిగా ప్రాజెక్ట్‌ కే సినిమా( Project K Movie ) లో ఈమె నటిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులోనే ఉన్న దీపిక పదుకొనే ను ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, ఒక బడా నిర్మాత మీట్ అయ్యారట.

తాము చేయబోతున్న ఒక భారీ ప్రాజెక్టు కోసం ఆమెను సంప్రదించారట.కానీ ఆమె మాత్రం కనీసం కథ కూడా వినకుండా తెలుగు సినిమా ను చేసేందుకు ఆసక్తిగా లేను అంటూ తేల్చి చెప్పిందని సమాచారం అందుతుంది.

"""/" / దీపిక తెలుగు లో ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫలితాన్ని బట్టి సినిమా ఉంటుందని అలాగే తెలుగు సినిమా కి తన పారితోషికం( Remunaration ) మరీ ఎక్కువ అవుతుందని ఆమెకి ఆమె భావిస్తుందట.

తెలుగు నిర్మాతలు ఎంత డిమాండ్ చేసినా కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.కానీ ఆమె మాత్రం తెలుగు లో వరుసగా సినిమా లు చేసి బాలీవుడ్( Bollywood ) లో తన స్థాయిని క్రేజీ ని తగ్గించుకోను అంటూ సన్నిహితుల వద్ద చెబుతుందట.

తెలుగు సినిమా లు చేయడం వల్ల స్థాయి ఎలా తగ్గుతుంది అంటూ ఆమె ను కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియా లో దీపిక పడుకొనే తెలుగు సినిమా లు మరిన్ని చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కానీ ఆమె మాత్రం ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాతే ఆ సినిమా ఫలితం వచ్చిన తర్వాతే కొత్త సినిమా ను మొదలు పెడతాను అన్నట్లుగా భీష్ముంచుకు కూర్చుంది.

దీపికా తెలుగు లో రెండవ సినిమా చేస్తుందా లేదా అనేది తెలియాలంటే కనీసం ఏడాది కాలం వెయిట్ చేయాల్సిందే.

పుష్ప2 1400 కోట్లు.. మిస్ యూ 2 కోట్లు.. సిద్దార్థ్ ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా?