ప్రాజెక్ట్ కే నుండి బర్త్ డే ట్రీట్.. వీరు కూడా కిక్ ఇవ్వలేదుగా..!

యంగ్ రెబల్ స్టార్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్.

ఈయన కృష్ణం రాజు వారసత్వంగా వచ్చిన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు.ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభాస్ కష్టానికి కొద్దిగా లక్ కూడా కలిసి వచ్చి బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

ఇక ఈ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ రోజు తన 42వ పుట్టిన రోజును జరుపు కున్నారు.

ఈ క్రంమలోనే సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లివెత్తుతున్నాయి.డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈయన నటిస్తున్న మూడు సినిమాల నుండి ఫ్యాన్స్ కోసం ఏదైనా ట్రీట్ వస్తుందా అని అంతా ఎదురు చూసారు.

కానీ పెద్ద కిక్ ఇచ్చే అప్డేట్ లు ఏమీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

ఈ మూడు సినిమాల నుండి పోస్టర్స్ లేదా టీజర్స్ విడుదల చేస్తారు అని గత వారం నుండి ప్రచారం జరుగుతుంది.

ఈయన నటింస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఎదురు చుసిన వారికీ నిరాశే ఎదురైంది.

"""/"/ ఆదిపురుష్ నుండి జస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేసి చేతులు దులుపు కున్నారు.

ఇక నాగ్ అశ్విన్ సైతం నిన్ననే బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తున్నట్టు చెప్పాడు.కానీ ఈయన ఏదో ఐరన్ మ్యాన్ చేయి తరహాలో డిజైన్ చేసినట్టుగా ఉందని.

ఆ పోస్టర్ కొంత మందికి అర్ధం కూడా కావడం లేదు.దీంతో ఫ్యాన్స్ ఆశలు అడియాసలు అయ్యాయి.

ఇంత పాన్ వరల్డ్ సినిమా నుండి ఇలాంటి అప్డేట్ ఊహించలేదు అంటూ ఇప్పటికే సగం సినిమా షూట్ అయిపోయింది ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ చేసి ఉండవచ్చు కదా అంటూ.

ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఓరి దేవుడా.. కళ్ళు సీసాలో ప్రత్యక్షమైన కట్లపాము