విజయవాడ డ్రగ్స్ కేసులో పురోగతి

విజయవాడ డ్రగ్స్ కేసులో పురోగతి లభించింది.అనంతపురం నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో వచ్చిన డ్రగ్స్ ను విజయవాడ నార్కోటెక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అనంతపురం, బెంగళూరు కేంద్రంగా ఎండీఎంఏ డ్రగ్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పార్సిల్ తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.ఈ క్రమంలోనే వ్యక్తి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

దీంతో అసలు నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

వీడియో: ఇదెక్కడి పిచ్చి పని.. ఫైర్‌క్రాకర్ బాక్స్‌పై కూర్చోబెట్టి చంపేశారు..?