టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రొఫైల్
TeluguStop.com
నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తండ్రి జంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగంవారిగుడెం గ్రామానికి చెందిన వారు.
ఈడి చదువుకున్న ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు.ఆయన సతీమణి అరుణ, కుమారుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, కోడలు స్రవంతి కాగా కూతురు రమ్య, అల్లుడు శ్యాంసుందర్ రెడ్డి.
విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేసిన కూసుకుంట్ల కేసీఆర్ పిలుపునందుకొని ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు.
2003 నుంచి టీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, మునుగోడు మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇంచార్జిగా పని చేశారు.
తెలంగాణలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఇంచార్జిగా వెళ్లి టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేశారు.
"""/"/
2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2104 లో మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపుపొందారు.తిరిగి 2018లో కూడా మునుగోడు నుండి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు.
ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా టిక్కెట్ దక్కించుకున్నారు.
వీడియో వైరల్.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ.. ఎందుకంటే?