తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్( Kothapalli Jayashankar ) అని , వారి సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ ఎన్.
ఖీమ్యా నాయక్ అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ గారి జయంతి( Prof Jayashankar Birth Anniversary ) పురస్కరించకుని వారి చిత్ర పటానికి అదనపు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నే ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాడి మలి దశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శనం గా నిలిచారన్నారు.
ఆచార్య జయశంకర్ మన మధ్య లేనప్పటికీ.అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.
ఆచార్యుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రామ్ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
హెచ్ 1 బీ వీసాలకు ఓకే .. కానీ సంస్కరణలు కావాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు