మాస్ రాజా అడిగినంత ఇచ్చిమరీ సినిమా చేయడానికి కారణం అదేనా?

మాస్ రాజా రవితేజ ప్రెసెంట్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధమాకా' సినిమా చేస్తున్నాడు.

దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ.అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమాను చేస్తున్నాడు.

ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇలా రవితేజ చేతిలో ఎప్పుడు నాలుగైదు సినిమాలు ఉంటాయి.అయితే ఈయన అన్ని సినిమాలు చేస్తున్న కూడా అన్ని హిట్ అయితే అవ్వడం లేదు.

ఒకటి హిట్ అయితే వరుసగా రెండు మూడు ప్లాప్స్ వస్తున్నాయి.అయినా కూడా రవితేజతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఈయన డేట్స్ ఇస్తే చాలు కోట్ల అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. """/"/ మరి వారికీ అన్ని ప్లాప్స్ వస్తున్నా కూడా ఇలా రవితేజ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎందుకు వెనకాడడం లేదు అని ప్రేక్షకులకు అర్ధం అవ్వడం లేదు.

ఈయనకు రెమ్యునరేషన్ గా 15 నుండి 20 కోట్ల రూపాయలు ఇస్తున్నారు.మరి అంత ఇవ్వడానికి.

సీనియర్ హీరో అయినా డిమాండ్ తగ్గకపోవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తే అతడి నాన్ థియేట్రికల్ మార్కెట్ అని అర్ధం అవుతుంది.

"""/"/ ఈయన గత చిత్రం ఖిలాడీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయినప్పటికీ ఈయన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

హిందీ మార్కెట్ లో కూడా ఈయనకు క్రేజ్ ఉండడంతో మాస్ రాజా నటించే హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది.

టీవీల్లో భారీ టీఆర్పీ రావడమే కాకుండా యూట్యూబ్ లో కూడా మిలియన్ వ్యూస్ వస్తున్నాయి.

ఇలా హిందీ మార్కెట్ ఇంకా ఓటిటి రైట్స్ వల్ల సినిమా అటు ఇటు అయినా ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల నిర్మాతల జేబులు నిండుతున్నాయి.

అందుకే ఈయనకు అధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమా చేయడానికి పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది.

Chandrababu : ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీల పొత్తు..: చంద్రబాబు