రేలంగి వారికి చెమటలు పట్టించిన నిర్మాత? ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు సినిమాలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలలో కెల్లా కూడా తెలుగు సినిమానే ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించగలదు అనే నానుడి ఉంది.

ఇపుడు దాదాపుగా సినిమాల్లో ఒక ట్రాక్‌కి మాత్రమే కామెడీ పరిమితం అయింది కానీ అప్పట్లో పూర్తి స్థాయి హాస్య చిత్రాలకు( Comedy Movies ) శ్రీకారం చుట్టిన వాళ్ళల్లో దర్శకుల్లో జంధ్యాల, రేలంగి నరసింహారావులను ప్రముఖంగా ఇక్కడ పేర్కొనాలి.

ఇక వీరి దారిలో ఇవివి సత్యనారాయణ, వంశీ వంటి దర్శకులు కామెడీనే ప్రధానాంశంగా తీసుకొని సినిమాలు తెరకెక్కించేవారు.

"""/" / అప్పట్లో రేలంగి నరసింహారావు( Relangi Narasimha Rao ) రాజేంద్రప్రసాద్‌తో 32, చంద్రమోహన్‌తో 24, మొత్తం కలుపుకొని 56 కామెడీ సినిమాలు చేసి రికార్డు స్థాపించారంటే మీరు నమ్మాలి.

సాధారణంగా కామెడీని బాగా చూపించే దర్శకుల్లో సెన్సాఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువగా ఉండాలి.

సరిగ్గా అలాంటి ఓ విచిత్రమైన సన్నివేశం రేలంగి నరసింహారావు జీవితంలో జరిగిందని మీకు తెలుసా? ఆయన డైరెక్టర్‌గా అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి.

ఓ సినిమా కోసం ఓ ప్రొడ్యూసర్‌( Producer ) ఆయనని సెలెక్ట్‌ చేసుకున్నారట.

అయితే సదరు నిర్మాత మెంటాలిటీ చాలా విచిత్రంగా ఉండేదట.ఈ క్రమంలో ఓ రోజు ఉదయం రేలంగి గారు స్నానానికి వెళ్దామని రెడీ అవుతుండగా.

బయటి నుంచి డైరెక్టర్‌గారూ అని గట్టిగా ఓ కేక వేయగా బయటకొచ్చి చూస్తే, సదరు నిర్మాత కనిపించారు.

ఆ వెంటనే ఆయన రేలంగి వారి ఇంటిని పరిశీలనగా చూసి ‘డైరెక్టర్‌గారూ, మీ ఇంట్లో ఏసీ ( AC ) లేదా?’ అని అడిగారట.

దాంతో ఆయన ‘లేదండీ’ అని చెప్పారట.దాంతో ఆయన చాలా ఆటపట్టించారట.

"""/" / విషయం ఏమిటంటే? ఏసీ లేదన్న మాటకి, ఆ నిర్మాత.‘భలేవారే.

మీలాంటి క్రియేటివ్‌ పర్సన్స్‌కి ఎన్నో ఆలోచనలు ఉంటాయి.మీ బుర్ర వేడెక్కుపోదు! ఏసీ కంపల్సరీ ఉండాలి’ అంటూ ‘ఒరేయ్‌ ఆఫీస్‌లోని బీరువాలో 18 వేలు వుంటాయి.

అవి తీసుకొని వెళ్లి ఒక విండో ఏసీ తీసుకురా’ అంటూ తన మనిషిని పురమాయించి అక్కడి నుంచి వెళ్లిపోయారట.

ఆ తర్వాత పాండీ బజార్‌ నుంచి మనిషిని తీసుకొచ్చి ఏసీ పెట్టడానికి వీలుగా పెద్ద హోల్‌ చేయించి వెళ్లిపోయారట.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.అలా వెళ్లిన వ్యక్తి రాత్రయినా రాలేదట.

దాంతో రేలంగి గారికి ఏం చెయ్యాలో తోచక ఆ హోల్‌కి బీరువా అడ్డం పెట్టి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడే పడుకున్నారట.

ఇక ఆ తరువాత ఏసీ బిగించారు లెండి.అది వేరే విషయం! అని రేలంగిగారు సరదాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా చెప్పుకొచ్చారు.

అప్పటి విషయాన్ని! .

ఇప్పటికైనా గోపిచంద్ కి సక్సెస్ వస్తుందా లేదా..?