మెగాస్టార్ చిరంజీవి తో అనుకోని వెంకటేష్ తో సినిమా తీసి జైలుకు వెళ్లిన నిర్మాత

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో నలుగురు 4 పిల్లర్లు గా ఉండేవారు.

అయితే వెంకటేష్ తో రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుందరకాండ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న సత్యనారాయణ అనుకోకుండా ఒక రోజు తమిళంలో హిట్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అన్నమలై చూసి దాన్ని రీమేక్ చేయాలని రీమేక్ రైట్స్ ని తీసుకున్నారు.

అందులో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వలన అప్పటికి మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి అయితే ఈ సినిమా కి బాగుంటుంది అనుకొని సత్యనారాయణ చిరంజీవి గారికి కథ చెబుదాం అని చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరారు .

ఆయన అదృష్టం ఏంటంటే ఆ ఫ్లైట్ లోనే చిరంజీవి కూడా ఉన్నాడు చిరంజీవి పక్కన కూర్చొని అన్నమలై కథ గురించి చెప్పాడు, చెప్పి ఈ సినిమా మనం చేద్దాం అని చెప్తే చిరంజీవి కూడా కథ బాగా నచ్చి తప్పకుండా చేద్దాం అని మాటిచ్చాడు.

దీనికి డైరెక్టర్ గా ఎవరిని పెట్టుకుందాం అని ఆలోచనలో సత్యనారాయణ ఉన్నాడు అప్పుడు సుందరకాండ షూటింగ్ జరుగుతున్న స్పాట్ కి వెళ్లి ఇలా రీమేక్ రైట్స్ తీసుకున్నాను అని చెప్పడంతో వెంకటేష్ సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి ఈ సినిమా కూడా మనమే చేద్దాం అని చెప్పాడు దాంతో సత్యనారాయణ కి ఏం చేయాలో అర్థం కాలేదు ఆల్రెడీ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ హీరోనే వచ్చి ఇంకో సినిమా చేద్దాం అని ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్ కి ఏ హీరో చెప్పడు అదృష్టం నాకు వచ్చింది ఇప్పుడు ఈ సినిమా వెంకటేష్ తో తీయాలా లేదంటే చిరంజీవి కి కథ చెప్పాను కాబట్టి చిరంజీవితో తియ్యాలా అనే డైలమాలో కొన్ని రోజులు సత్యనారాయణ ఉన్నారు.

కానీ చివరగా సత్యనారాయణ వెంకటేష్ తో సినిమా చేయడం కరెక్ట్ అనుకుని వెంకటేష్ తో సినిమా అనౌన్స్ చేశారు.

"""/"/ కానీ ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరిని తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు వెంకటేష్ తో ఆల్రెడీ చంటి లాంటి సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు అయిన రవిరాజా పినిశెట్టి గారిని దర్శకుడిగా తీసుకుందాం అనుకొని ఈ సినిమా ని స్టార్ట్ చేశారు.

ఈ సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ గా సుమన్ నటించాడు తమిళ్ వెర్షన్ కంటే తెలుగులో వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫైనల్ స్క్రిప్టు రెడీ చేశాడు.

మొత్తానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది ఈ సినిమాకి డైలాగ్ రైటర్స్ గా పరుచూరి బ్రదర్స్ పని చేశారు.

ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది వెంకటేష్ పాత్ర స్నేహానికి విలువ ఇచ్చే విధంగా తీర్చిదిద్దారు ఈ పాత్రలో వెంకటేష్ తనదైన నటనని కనబరుస్తూ మంచి హీరోగా గుర్తింపు పొందాడు.

అలాగే వెంకటేష్ ఫ్రెండ్ గా నటించిన సుమన్ కూడా తనదైన నటనతో నటించి మంచి గుర్తింపు సాధించాడు.

కొండపల్లి రాజా సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా వెంకటేష్ కి అప్పటివరకు ఉన్న సినిమాల కంటే కూడా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది అలాగే రవి రాజా పినిశెట్టి దర్శకత్వ ప్రతిభ కూడా జనానికి బాగా నచ్చింది.

"""/"/ అలా ఒక సినిమా షూటింగ్ టైం లో ఉన్నప్పుడే ఆ సినిమా హీరో ప్రొడ్యూసర్ కి ఇంకో సినిమాకి డేట్స్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

వెంకటేష్ తన మంచి మనసుని ఇలా డేట్స్ ఇవ్వడం ద్వారా నిరూపించుకున్నాడు అందుకే వెంకటేష్ ని ప్రొడ్యూసర్ల హీరో అని కూడా పిలుస్తారు.

అయితే సత్యనారాయణ గారికి చిరంజీవితో చేయాలని ఆశ నెరవేరక పోయిన వెంకటేష్ లాంటి మంచి హీరో దొరికినందుకు ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు.

ఆ తర్వాత వెంకటేష్ చాలా సినిమాల్లో నటించి తన విక్టరీ బ్రాండ్ నీ కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో F3 సినిమాలో నటిస్తున్నాడు అలాగే ఈ మధ్య మలయాళంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన దృశ్యం రీమేక్ అయిన దృశ్యం2 సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు ఈ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది.

వైరముత్తు చాలా మంచోడు.. చిన్మయి క్యారెక్టర్ అలాంటిది: కస్తూరి శంకర్