వీక్ డేస్ లో టికెట్ రేట్లు తగ్గించాలి… నిర్మాత సురేష్ బాబు కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా టికెట్ల రేట్ల గురించి పెద్ద ఎత్తున వివాదం జరిగిన సంగతి తెలిసిందే.

గత కొంతకాలంగా సినిమా టికెట్ల రేట్ల పెంపుదల గురించి కూడా ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి.

అయితే తాజాగా సినిమా టికెట్ల రేట్లు( Ticket Rate ) విషయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు( Suresh Babu ) ఓ ప్రతిపాదన తీసుకోవచ్చారు.

ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేష్ బాబు సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / శుక్రవారం సినిమా విడుదల అయితే శని ఆదివారాలలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వస్తుంటారు.

ఈ క్రమంలోని వీకెండ్ లో సినిమా టికెట్ల రేట్లు పెంచినప్పటికీ వీక్ డేస్ అనగా సోమవారం నుంచి గురువారం వరకు టికెట్ల రేటు తగ్గిస్తే బాగుంటుందని ఈయన ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు.

అయితే ఇప్పటికే ఈ పద్ధతి బెంగుళూరులో( Bangalore ) అలాగే ఓవర్సీస్ లో కూడా కొనసాగుతుంది.

అందుకే ఇక్కడ కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మరిన్ని లాభాలను అందుకోవచ్చని ఈయన తెలియజేశారు.

"""/" / వీకెండ్ రోజులలో మల్టీప్లెక్స్ లో 250 రూపాయలుగా ఉన్నటువంటి టికెట్ ధర వీక్ డేస్ లో 150 రూపాయలు చేస్తే వీకెండ్ లో చూడలేనటువంటి వారు వీక్ డేస్ లో సినిమాని చూస్తారని ఈయన తెలియజేశారు.

ఇలా మనకు అనుగుణంగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకొని తగ్గించుకొని పద్ధతి ఉంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతారని ఈయన తెలియజేశారు.

ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంపుదల అలాగే తగ్గించడం గురించి సురేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో…