ఇక పిసుక్కోవడమే మెగా ఫాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ ప్రొడ్యూసర్?

సినిమా ఇండస్ట్రీలో మెగా వెర్సెస్ అల్లు అనే వివాదం గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది.

అయితే నంద్యాలలో బన్నీ పర్యటన తరువాత ఈ వివాదం మరింత ఎక్కువగా మారిపోయిందని చెప్పాలి.

ఇలా మెగా అభిమానులు( Mega Fans ) అల్లు అర్జున్( Allu Arjun ) అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయంలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం చేస్తున్నారు.

ఇలా ఈ రెండు కుటుంబాలు మధ్య వివాదాలు ఉన్నాయి అంటూ మెగా అభిమానులు కూడా వేరుపడి అల్లు అర్జున్ సినిమాలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ వచ్చారు.

ముఖ్యంగా పుష్ప 2( Pushpa 2 ) సినిమా విషయంలో మెగా అభిమానులు నెగిటివిటీని  పెంచారనీ అల్లు అభిమానులు కూడా ఈ విషయంపై మండిపడుతూ మెగా హీరోలపై ట్రోల్ చేశారు.

"""/" / ఇలా ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇటు మెగా కుటుంబానికి అటు అల్లు కుటుంబానికి ఎంతో సన్నిహితుడైనటువంటి నిర్మాత ఎస్ కే ఎన్( Producer SKN ) మాత్రం అభిమానులను ఆపడానికి ఎంతో ప్రయత్నం చేసేవారు.

ఇకపోతే ఈయన మెగా కుటుంబం కంటే కూడా అల్లు కుటుంబానికి చాలా సన్నిహితుడు అని చెప్పాలి.

ఒక న్యూస్ రిపోర్టర్ గా వచ్చిన ఈయన అనంతరం H3 Class=subheader-styleఅల్లు అర్జున్/h3p పి.

ఆర్ గా పనిచేస్తూ కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు.ఇక ప్రస్తుతం బేబీ సినిమాతో పూర్తి స్థాయిలో నిర్మాతగా మారి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

"""/" / ఇక ఎస్కేఎన్ కు బన్నీ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతారనే సంగతి తెలిసిందే.

ఇక అల్లు ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ఈయన కూడా తనదైన శైలిలోనే వారికి కౌంటర్ ఇస్తూ ఉంటారు.

తాజాగా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య జరుగుతున్న వివాదాల నడుమ పవన్ కళ్యాణ్ ని( Pawan Kalyan ) బాబాయి అని ఉచ్చరిస్తూ బన్నీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు కూడా షాక్ అయ్యారు.ఇలాంటి తరుణంలోనే ఎస్ కే ఎన్ సోషల్ మీడియా వేదికగా అఆ సినిమాలో రావు రమేష్, అజయ్ మధ్య జరిగే సంభాషణ వీడియో క్లిప్ ను పోస్ట్ చేశాడు.

అందులో ఇప్పుడేం చేద్దాం నాన్న అని అజయ్ అనగా.ఇంకేముందు పిసుక్కోవడమే అనే డైలాగ్ పోస్ట్ చేశారు.

చెప్పింది నీ లాంటి వల్ల గురించి… నిన్న వెళ్లిన చిల్లర డిబేట్లకు ఎప్పుడు వెళ్ళకు.

ఇలాంటి డిబేట్లకు వెళ్లి ఫ్యామిలీ హీరోల మీద ఎప్పుడు కూడా కామెంట్స్ చేయకండి ఫ్యామిలీ హీరోలే కాదు.

ఏ ఇతర సినీ హీరోలపై కూడా కామెంట్స్ చెయ్యొద్దు.ఆన్లైన్లో ఏదో కొట్టుకున్నారని ఇక ఈ విషయాలన్నింటినీ ఇక్కడితో ఆపేయండి అంటూ ఈయన పరోక్షంగా మెగా అభిమానులకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.