Producer Ravishankar:పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కిన ప్రొడ్యూసర్.. మండిపడుతున్న అభిమానులు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కి ఉండే మాస్ ఫాలోయింగ్ తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకి లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అలా అని పవన్ కళ్యాణ్ పెద్దగా సినిమాలలో నటించలేదు.నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్.

రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా అనిపించుకున్న వ్యక్తి పవన్.

ఎంతోమందికి అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.అందుకే పవర్ స్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ ని దేవుడు గా భావిస్తూ ఉంటారు.

"""/" / పవన్ కళ్యాణ్ మా దేవుడు అంటూ ఆయన పేర్లు ఫోటోలు చేతులపై టాటూ లు కూడా వేయించుకుంటూ ఉంటారు.

రాజకీయ నాయకుడిగా జనసేన అనే పార్టీను ప్రారంభించి అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎంతోమంది రైతులకు అండగా నిలిచారు.

పేదలు కష్టాల్లో ఉంటే చలించిపోయే పవన్ కళ్యాణ్ ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తారు.

కాగా మరికొద్ది నెలల్లో ఏపీలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే పేరుతో ప్రచార రథాన్ని కూడా సిద్దం చేసుకున్నారు.

తాజాగా వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) కూడా ప్రారంభమైంది.

"""/" / అయితే ఈ వారాహ విజయ యాత్ర ప్రారంభానికి ముందు మంగళగిరిలో చోటు చేసుకున్న ఒక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ కార్యక్రమంలో టాలీవుడ్ కు చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు.వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత అయిన వై రవిశంకర్, డివివి దానయ్య, ఏ ఎం రత్నం, బివిఎన్ ఎస్ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఉన్నారు.

వీరంతా యాగంలో పాల్గొని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.అయితే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్ పవన్ పాదాలకు నమస్కరించాడు( Producer Ravishankar Touch Pawan Feet ).

దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే కొంతమంది నెటిజెన్స్ రవిశంకర్ చేసిన పనికి మండిపడుతుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ మా దేవుడు.

పవన్ కళ్యాణ్ అభిమానం అంటే అలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయంపై పవన్ అభిమానులు నెటిజన్స్ పై మండిపడుతూ అయిన రవిశంకర్ పవన్ కాళ్లు మొక్కితే మీకేంటి సమస్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్… విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!