అవతార్2 సినిమాపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగవంశీ.. ఏమన్నారంటే?

స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాతలలో ఒకరు కాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో బుట్టబొమ్మ టైటిల్ తో తెరకెక్కిన సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

ఒకింత భారీ బడ్జెట్ తోనే బుట్టబొమ్మ తెరకెక్కగా ఈ సినిమా పోస్టర్ కాపీ అంటూ కొంతకాలం క్రితం కామెంట్లు వినిపించాయి.

అదే సమయంలో అవతార్2 సినిమా గురించి నాగవంశీ నెగిటివ్ కామెంట్లు చేయగా సోషల్ మీడియాలో ఆయన గురించి ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.

అయితే అవతార్2 సినిమా విషయంలో చేసిన కామెంట్ల గురించి నాగవంశీ మరోసారి స్పందిస్తూ ఈసారి మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలు సక్సెస్ సాధించినా ఆ సినిమాలపై నెగిటివ్ కామెంట్లు వస్తాయని ఆయన అన్నారు.

మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లపై నెగిటివ్ కామెంట్లు చేయడం జరుగుతోందని నాగవంశీ చెప్పుకొచ్చారు.

జేమ్స్ కేమరూన్ మనకు పరిచయం లేని డైరెక్టర్ అని ఆయన వెల్లడించారు. """/"/ జేమ్స్ కేమరూన్ డైరెక్ట్ చేసిన సినిమా నచ్చని పక్షంలో ఆ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పడం తప్పెలా అవుతుందని నాగవంశీ కామెంట్లు చేశారు.

అవతార్ 2 సినిమాకు తనకు నచ్చలేదని ఆయన వెల్లడించారు.సినిమా నచ్చని పక్షంలో నాకు నచ్చలేదని నా ఒపీనియన్ ను వెల్లడించడం కూడా తప్పా? అంటూ నాగవంశీ ప్రశ్నించడం గమనార్హం.

త్రీడీ కళ్లద్దాలతో అవతార్2 మూవీ చూసిన నాకు తలనొప్పి వచ్చిందని నాగవంశీ అన్నారు.

"""/"/ భారీ హైప్ తో అవతార్2 మూవీ విడుదలైందని ఆ హైప్ కు సినిమాకు సంబంధం లేదని ఆయన కామెంట్లు చేశారు.

నా ఒపీనియన్ ను నేను వ్యక్తపరచడంలో తప్పేముందని నాగవంశీ చెప్పగా నెటిజన్ల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సి ఉంది.

నాగవంశీపై ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.

పెదాల పగుళ్ల నుంచి మొటిమల నివారణ వరకు తేనెతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా..?