ఒక్క సినిమా టికెట్ కు రూ.1500 ఖర్చు పెట్టలేరా.. నిర్మాతను ఏకీపారేస్తున్న నేటిజన్స్?

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ( Suryadevara Nagavamshi ) నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.

ఇలా నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తనకు సంబంధించి తన సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి నెగటివ్ ట్రోల్స్ వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి తనదైన స్టైల్ లోని సమాధానం చెబుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగ వంశీ సినిమా టికెట్ల రేట్ల ( Movie Ticket Cost ) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు.

"""/" / ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం మారడంతో చిత్ర పరిశ్రమకు కాస్త అనుకూలంగా ఉందనే చెప్పాలి.

సినిమా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా ఆదనపు షోలకు కూడా అనుమతి ఇస్తున్నారు.

అయితే ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంచడం అనేది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి భారమే అనే వాదనలు కూడా వినపడుతున్నాయి.

ఈ విషయం గురించి నాగ వంశీ మాట్లాడుతూ ఒక కుటుంబం సినిమా చూడటానికి కేవలం రూ.

1500 మాత్రమే ఖర్చు చేస్తున్నారు.నా దృష్టిలో అది చాలా తక్కువ అని తెలిపారు.

"""/" / మూడు గంటల పాటు వినోదాన్ని అందించడం కోసం 1500 మాత్రమే ఖర్చు చేస్తున్నారని, ఇలాంటి వినోదాన్ని మీరు మరెక్కడ పొందలేరని, మీ ఫ్యామిలీతో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్తే ఇంతకుమించి ఖర్చు చేస్తారని ఈ సందర్భంగా నాగ వంశీ సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

మీ దృష్టిలో 1500 తక్కువ కావచ్చు కానీ ఒక మధ్య తరగతి కుటుంబానికి ఇది చాలా ఎక్కువే అంటూ కామెంట్లో చేస్తున్నారు.

అమెరికాలోని ఆ ప్రాంతంలో ఏలియన్స్ నివసిస్తున్నాయా.. షాకింగ్ ట్రూత్ రివీల్డ్‌..?