దేవర ఫ్యాన్స్ కు అదిరిపోయే తీపికబురు చెప్పిన నాగవంశీ.. ఆ క్లారిటీ ఇచ్చేశాడుగా!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ వంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లు కలిసి ఉన్న ఒక పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దేవర సినిమా గురించే చర్చించుకుంటున్నారు.

కాగా సోషల్ మీడియాలో దేవర సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నిర్మాత నాగ వంశీ( Naga Vamsi ) తెగ హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే.

"""/" / ఒక నిర్మాత తరహాలోనే దేవర సినిమాకు ఆయన ప్రమోషన్స్ చేస్తున్నట్టే కనిపించారు.

అయితే ఇప్పటివరకు దేవర సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన చేసిన హడావిడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఎట్టకేలకు ఆయన చేస్తున్న హడావిడి వెనుక ఉన్న కారణం తెలిసిపోయింది.తాజాగా ఆయన ఒక స్పెషల్ అప్డేట్ ని కూడా విడుదల చేశారు.

కాగా నాగ వంశీ, దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నాగ వంశీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర హక్కులు ఎంతకు అమ్ముడయ్యాయో స్పష్టత లేదు, కానీ గట్టి రేటే నిర్మాతలు కోట్ చేయగా, నాగ వంశీ ఆ హక్కులను దక్కించుకున్నారు.

"""/" / దేవర సినిమా ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కాగా ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సాంగ్ లిరికల్ సాంగ్ ను ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.రెండు భాగాలుగా విడుదల కానున్న దేవర సినిమా మొదటి భాగం సెప్టెంబర్ లో విడుదల కానుంది.

భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి.

ఫైర్ బ్రాండ్ బ్యూటీ రాశి ఖన్నా రెడ్ హాట్ అవుట్ ఫిట్స్