ఆ టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి పిక్స్… గుడ్ న్యూస్ చెప్పేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఒకరు.
ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగులో మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ తో( Allu Arjun ) కలిసి నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
ఇకపోతే రష్మిక గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో ప్రేమలో ఉన్నారని తననే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
కానీ ఇప్పటివరకు వీరు మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
"""/" /
ఇకపోతే తాజాగా రష్మిక పెళ్లి గురించి నిర్మాత నాగ వంశీ( Producer Nagavamsi ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నాగ వంశీ నిర్మాణంలో బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్( Daku Maharaj ) సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కాబోతుంది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నాగ వంశీ, బాబి ముగ్గురు బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి( Unstoppable Show ) హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. """/" /
ఇందులో భాగంగా ఉరుములు మెరుపులతో తమన్ ఎంట్రీ ఇచ్చారు.
తమన్ రావడంతోనే థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం బాలకృష్ణ గారి అఖండ సినిమాతోనే మొదలైందని ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా విడుదల తర్వాత కూడా స్పీకర్లు పగిలిపోవడం ఖాయం అంటూ ఈయన సినిమాపై హైప్ పెంచేశారు.
తమన్ గురించి తాను ఇంటర్నేషనల్ స్టోరీస్ విన్నానని, అనుష్క అంటే తనకు ఇష్టం కదా అని అన్నారు.
తనకు రష్మిక అంటే క్రష్ అని, పెళ్లి సెటిల్ అయ్యిందని విన్నానని చెప్పారు.
వెంటనే నాగ వంశీ మాట్లాడుతూ.ఒక తెలుగు హీరోతో రష్మిక పెళ్లి) ఫిక్స్ అయిందని తెలుసు ఆ హీరో ఎవరో తెలియడం లేదు అంటూ ఈయన కూడా హింట్ ఇచ్చేశారు.
ఇక తెలుగు హీరో అంటే విజయ్ దేవరకొండతోనే( Vijay Devarakonda ) రష్మికకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాలి.
ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆరెంజ్ పండ్లతో కలిపి వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు..తెలుసా?