ఫ్యామిలీ స్టార్ ఫ్లాపైనా డైరెక్టర్ కు హామీ ఇచ్చిన దిల్ రాజు.. ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారా?

సాధారణంగా ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే హీరో, నిర్మాత కంటే దర్శకుడిపై ఎక్కువ ప్రభావం పడుతుంది.

ఫ్లాప్ డైరెక్టర్ కు కొత్త సినిమా ఆఫర్ రావడం కూడా సులువు కాదు.

అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star Movie ) అంచనాలను అందుకోకపోయినా పరశురామ్ కు మాత్రం దిల్ రాజు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఫ్యామిలీ స్టార్ సినిమాకు పరశురామ్( Parasuram ) 14 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని సమాచారం.

ఆ రేంజ్ లో పరశురామ్ కు పారితోషికం దక్కుతుందని చెప్పలేం కానీ దిల్ రాజు( Dil Raju ) హామీ ఇవ్వడంతో త్వరలో ఈ డైరెక్టర్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

గీతా గోవిందం సక్సెస్ తో మార్కెట్ పెంచుకున్న పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను ఒకింత నిరాశపరిచాయి.

నెగిటివ్ టాక్ వల్ల ఫ్యామిలీ స్టార్ సినిమాకు టార్గెట్ లో సగం కలెక్షన్లు వచ్చే ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది.

"""/" / ఫ్యామిలీ స్టార్ సినిమా తమిళంలో రిలీజ్ కాగా అక్కడ కూడా ఈ సినిమాకు కలెక్షన్లు ఆశాజనకంగా లేవు.

పరశురామ్ రెంచ్ రాజు( Rench Raju ) పేరుతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని కార్తీతో ఈ సినిమా తీయాలని భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో కార్తీ( Karthi ) డేట్లు దొరకడం కష్టమని తెలుస్తోంది.

త్రివిక్రమ్, కార్తీ కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తుండటంతో కార్తీ ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని భోగట్టా.

"""/" / పరశురామ్ కథ, కథనం విషయంలో దృష్టి పెడితే కోరుకున్న సక్సెస్ దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దిల్ రాజు సైతం నిర్మాతగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పరశురామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా మార్కెట్ పెంచుకుంటున్నారు.పరశురామ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తే ఆయన కెరీర్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

బన్నీ బొమ్మను కాలితో గీసి అభిమానం చాటుకున్న దివ్యాంగ అభిమాని.. ఏమైందంటే?