అప్పటివరకు తారక్ పొలిటికల్ ఎంట్రీ లేనట్టేనా.. అభిమానులకు ఆ విషయంలో నిరాశ తప్పదా?

ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.2024 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు సైతం జవాబు చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు( Chitti Babu ) మాత్రం తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడని చిట్టిబాబు కామెంట్లు చేశారు.తారక్( Jr NTR ) వచ్చిన వెంటనే సీఎం కావడం సులువు కాదని ఆయన తెలిపారు.

మరో పదేళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.

తారక్ అవసరం అనుకుంటే టీడీపీ( TDP ) తరపున ప్రచారం చేస్తాడని ఆయన తెలిపారు.

టీడీపీ పతనావస్థకు వస్తే మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని చిట్టిబాబు వెల్లడించారు.

ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ లోకేశ్ కు( Nara Lokesh ) లేదని ఆయన పేర్కొన్నారు.

"""/" / ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలలో కెరీర్ పరంగా లోటు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కు మెచ్యూరిటీ ఉందని అయితే ప్రజల్లో సైతం తారక్ అవసరం ఉందని అభిప్రాయం రావాలని చిట్టిబాబు వెల్లడించారు.

ప్రస్తుతం నారా తెలుగుదేశం అని సరైన సమయం వస్తే నందమూరి తెలుగుదేశం వస్తుందని చిట్టిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

"""/" / సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని మరి ఎన్టీఆర్ ను అప్పట్లో చంద్రబాబు( Chandrababu Naidu ) ఎందుకు సస్పెండ్ చేశారని చిట్టిబాబు అన్నారు.

చిట్టిబాబు వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.తారక్ మనస్సులో ఉన్న విషయాలనే చిట్టిబాబు చెప్పారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తారక్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పదని భోగట్టా.

దేవర సినిమాతో తారక్ ప్రస్తుతం బిజీగా ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

రాజమౌళి సినిమా హిట్టైతే పాన్ వరల్డ్ స్టార్ గా మహేష్.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తారా?