సిగ్గు వదిలేస్తేనే రాజకీయాలలోకి రండి…బన్నీ వాసు కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా మంచి సక్సెస్ అయినటువంటి బన్నీ వాసు ( Bunny Vasu )వరుస సినిమాలోని తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

తాజాగా కోటబొమ్మాలి సినిమా( Kotabommali Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా పాల్గొన్నటువంటి బన్నీ వాసు రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా కాస్త రాజకీయ నేపథ్యంలోనే కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు బన్నీ వాసుని ప్రశ్నిస్తూ. """/" / రాజకీయ నాయకులు విద్యావంతులు ఈ సినిమా చూసి వాళ్ళు ఎలా ఫీలవుతారని మీకు అనిపించింది అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు బన్నీ వాసు సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.మీరు బాగా సంపాదించి మంచి విద్యావంతులైతే ఇంట్లో ఉండండి రాజకీయాలలోకి మాత్రం రావద్దు అంటూ బన్నీ వాసు సలహా ఇచ్చారు.

ఎందుకంటే ప్రస్తుత ఉన్నటువంటి రాజకీయాలలోకి రావాలి అంటే మనం సిగ్గు ల*అన్ని వదిలేసి ఎవరు ఏమి తిట్టినా ఫోటోలు ఎవడు సోషల్ మీడియాలో షేర్ చేసిన పరవాలేదు.

"""/" / వాడి భార్యను పిల్లలను ఎవడేమీ అన్నా నాకేమీ పట్టదు అనుకున్న వాడు బట్టలిప్పి రోడ్డుపై నిలబడగలిగేవాడు మాత్రమే రాజకీయాలలోకి రావాలని మంచి విద్యావేత్తలు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నటువంటి వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని అలాంటివారు రాజకీయాలకు పనికిరారని, ఇలాంటివారు రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది అంటూ ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి బన్నీ వాసు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో: కొడుకు మొండితనానికి తండ్రీకొడుకులను విమానం నుంచి దించేసిన విమాన సిబ్బంది..