వకీల్ సాబ్ ఈవెంట్లో పవన్ నామ స్మరణ చేసిన బండ్లన్న..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్లగణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ని ఆయన పొగిడిన విధానం ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తోంది.

ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై చూసినా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలే ప్రత్యక్షమవుతున్నాయి.

ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా బండ్ల గణేష్ ఏం వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటే.

"ఏడు కొండల వాడికి అన్నమయ్య.శివుడికి భక్తకన్నప్ప.

శ్రీరాముడికి హనుమంతుడు.పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్‌ అని సగర్వంగా నేను చెప్పుకుంటాను " అని ఆయన తన ప్రసంగాన్ని ఘనంగా ప్రారంభించారు.

స్పీచ్ మొదటిలోనే భారీ డైలాగ్ వదిలిన బండ్ల గణేష్ ఆ తర్వాత మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ ఒక వ్యసనం అని.ఆయనకు అలవాటు పడితే చనిపోయేంత వరకు వదిలిపెట్టలేమని బండ్ల గణేష్ చెప్పగానే పవన్ చిరునవ్వు నవ్వారు.

వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడమని చిత్ర బృందం తనని పిలిచినట్టు చెప్పుకొచ్చిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడేంత స్థాయి తనకు లేదని అన్నారు.

పవన్ చూడని హిట్స్ లేవు.బ్లాక్ బస్టర్స్ లేవు అని తెగ పొగిడిన ఆయన.

పవన్ రాజకీయాల్లో ఉంటూనే.సినిమాలు చేస్తూ 1200 మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు.

"""/"/ "చాలామంది పుడుతుంటారు.చనిపోతూ ఉంటారు కానీ చరిత్రలో కొందరు మాత్రమే బతుకుంటారు.

అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు.ఆయన కళ్ళల్లో ఏదో నిజాయితీ ఉంది.

ఆయన వెనుక ఎన్ని కుట్రలు పన్నినా ఆయన ముందుకు వెళితే అన్ని మర్చిపోవలసిందే.

నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడిని" అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఒక సంఘటన గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఎయిర్‌పోర్టులో పవన్ గారు అంత పొగరుగా వెళ్ళిపోతున్నారేంటని ఒక వ్యక్తి తనని అడిగినట్టు.

బదులుగా తాను ఒక దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.పవన్ కి అభినందన్ మీస కట్టుకి ఉన్నంత పొగరు ఉందని.

 భారత మాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ కత్తి పవనానికి ఉన్నంత పొగరు ఉందని.

బ్రిటీషుల పతనాన్ని శాసించి రెపరెపలాడిన త్రివర్ణ పతాకానికి ఉన్నంత పొగరుందని.నూనూగు మీసాల భగత్ సింగ్ పోరాటానికి ఉన్నంత పొగరుందని.

లంకా యుద్ధంలో రామ బాణానికి ఉన్నంత పొగరు ఉందని చెప్పానని ఆయన గర్వంగా చెబుతూ పవన్ తో సహా దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్, యాంకర్ సుమ లను బాగా నవ్వించారు.

భర్తను వీర బాదుడు బాదిన భార్య.. ఈ ఫన్నీ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకోండి..