హాస్పిటల్ పాలైన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బండ్ల గణేష్ (Bandla Ganesh) స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన అనుకోకుండా నిర్మాతగా మారిపోయారు.నిర్మాతగా కొనసాగుతున్నటువంటి బండ్ల గణేష్ అద్భుతమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా (Producer) సక్సెస్ అందుకున్నారు.

ఇలా నిర్మాతగా సక్సెస్ అయినటువంటి బండ్ల గణేష్ రాజకీయాలలోకి (Politics ) కూడా ఎంట్రీ ఇచ్చారు.

"""/" / ఇలా రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి ఈయన అనుకున్న స్థాయిలో రాజకీయాలలో రాణించలేకపోయారు.

ఇలా రాజకీయాల పరంగా సినిమాల పరంగా బిజీగా ఉన్నటువంటి బండ్ల గణేష్  తాజాగా హాస్పిటల్ పాలయ్యారనే విషయం తెలియడంతో అభిమానులు ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అపోలో హాస్పిటల్ బెడ్ పై ఈయన ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నట్టు కనిపించారు.

పక్కనే నర్స్ ఆయనకు ట్రీట్మెంట్ చేస్తూ కూడా కనిపించారు. """/" / ఇలా హాస్పిటల్ బెడ్ పై బండ్ల గణేష్ కనిపించడంతో ఈయనకు ఏమైంది ఎందుకు ఇలా హాస్పిటల్ పాలయ్యారనే విషయంపై కంగారు వ్యక్తం చేస్తున్నారు.

అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ కి వెళ్ళారని తెలుస్తుంది.

ప్రస్తుతమైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు.

మరి కాసేపట్లో ఈయన అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నట్లు ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సినిమాలను కూడా నిర్మించడం లేదు కానీ త్వరలోనే తాను పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేస్తానని పలు సందర్భాలలో వెల్లడించారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!