ఆరు నెలల వయస్సులో నోబెల్ వరల్డ్ రికార్డ్ సంపాదించుకున్న బుడతడు.. ఇంత టాలెంటా అంటూ?

ఆరు నెలల వయస్సు ఉన్న బాలుడు ఏకంగా నోబెల్ వరల్డ్ రికార్డ్ ( Nobel World Record )సాధించి వార్తల్లో నిలిచాడు.

అతిచిన్న వయస్సులోనే తన ప్రతిభతో ఈ బాలుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ఈ బుడ్డోడి టాలెంట్ ను చూసిన నెటిజన్లు మరీ ఇంత టాలెంటా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రజ్వల్( Prajwal ) టాలెంట్ చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ బుడ్డోడి జ్ఞాపకశక్తి అద్భుతం అని భవిష్యత్తులో ఈ బుడతడు మరిన్ని సంచలనాలను సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రొద్దుటూరులోని శాస్త్రి నగర్( Shastri Nagar In Proddutur ) కు చెందిన సౌమ్య ప్రియ, పవన్ కుమార్ దంపతుల కుమారుడైన ప్రజ్వల్ జంతువుల, వాహనాల, పక్షుల ఫోటోలను చూపించి పేరు చెబితే సరిగ్గా వాటిని గుర్తు పడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ప్రజ్వల్ పేరెంట్స్ అతని టాలెంట్ కు సంబంధించిన వీడియోలను గత నెల 19వ తేదీన నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థకు పంపారు.

"""/" / ఈ చిన్నారి ప్రతిభకు ఆశ్చర్యపోయిన సంస్థ నిర్వాహకులు ఆన్ లైన్ ద్వారా ఈ బుడతడికి అవార్డ్ ను పంపారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ బుడతడు క్యూట్ గా ఉండగా ఆ ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

పవన్, సౌమ్య దంపతుల ( Pawan , Soumya )కూతురు వినీష వయస్సు నాలుగేళ్లు కాగా ఈ చిన్నారికి ఇప్పటివరకు ఐదు అవార్డులు వచ్చాయి.

"""/" / పసిప్రాయంలోనే నోబెల్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన ఈ బుడతడి టాలెంట్ ను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహిస్తున్న పవన్, సౌమ్యలను కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.పవన్, సౌమ్యలా చిన్నప్పటి నుంచి పిల్లల టాలెంట్ ను వెలికితీసేలా తల్లీదండ్రులు వ్యవహరిస్తే మంచిది.

మాటలు వస్తే ఈ బుడతడు మరింత ప్రతిభ చూపే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లరి మూకల దాడులు .. కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్ధులకు కేంద్రం హెచ్చరికలు