శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహమూర్తుల ఊరేగింపు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం మూర్తుల ఊరేగింపు మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా ఊరేగింపు నిర్వహించారు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత విగ్రహం రెండు ద్వారపాలకుల విగ్రహాలు, గణపతి విగ్రహం, అమ్మవారి వాహనం సింహం, తాబేలు విగ్రహాలను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సాహ విగ్రహాన్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించి వాహానం లో శ్రీ మార్కండేయ మందిరం నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

వాహనం ముందు ఆర్య వైశ్య సంఘం మహిళలందరు ఓకే రకమైన వస్త్రాలు ధరించి భక్తి పాటలతో కోలాటాలతో చేసిన నృత్యాలు అలరించారు.

ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా చిన్న మల్లేశం ఆద్వర్యంలో మండలంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

యూనివర్సిటీ క్యాంటీన్‌లో గొడవ.. ఈ ఇద్దరు అమ్మాయిలు ఎలా కొట్టుకున్నారో చూస్తే షాకే..?