ఓటు వేసే ఎన్నారైలకి కీలక సూచన..!

విదేశాలలో ఉండే ఎన్నారైలు ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండనే ఉంది.అయితే వారు ఓటు వేయడానికి వచ్చే క్రమంలో వారితో పాటు ఉంచుకోవాల్సిన ఆధారాలు ఏమిటి అనే సూచనలని చేసింది కేంద్రం ఎన్నికల సంఘం.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నారైలు.తమ పాస్ పోర్ట్ ని ఒక ప్రూఫ్ గా చూపిస్తే సరిపోతుందని ఈసీ ప్రకటించింది.

కేవలం ఫోటో ఓటరు, స్లిప్పులను ప్రూఫ్‌గా అంగీకరించకూడదని తెలిపింది.ప్రతీ ఒక్కరూ ఓటు కార్డు కూడా తప్పకుండా తీసుకు రావాలని పేర్కొంది.

అయితే ఒకవేళ ఎవరైనా ఓటరు కార్డును తీసుకురాలేకపోతే.ఈ క్రింది తెలిపిన వాటిలో ఎదో ఒకటి తీసుకువచ్చినా చాలని సూచించింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ - ఆధార్ కార్డు - పాస్‌పోర్టు - డ్రైవింగ్ లైసెన్స్ - రాష్ట్ర/కేంద్ర/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ జారీ చేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ - బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు పాస్‌బుక్ - పాన్‌కార్డ్ - ఎన్‌పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ - ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్ - కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద ఇచ్చిన హెల్త్ ఇన్సురెన్స్ స్మార్ట్‌కార్డ్ - ఫొటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్ - ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు.