పాపం... విజయ్ దేవరకొండకు ఎన్ని బాధలొచ్చాయో.. పాపం!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలె లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంతనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో విజయ దేవరకొండ తో పాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు.

అయితే సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది అని ఏమాత్రం నిరాశ చెందకుండా వెంటనే మరుసటిరోజే తన తదుపరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది.కాగా ఇందులో హీరో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి.అవేమిటంటే హీరోయిన్ గా నటిస్తున్న సమంతకు ఏవేవో సమస్యలు రావడంతో ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది.

సమంత ఎప్పుడు వస్తుందా అని విజయ్ దేవరకొండ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఎదురుచూస్తున్నారు.

కానీ సమంత మాత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.కాగా సమంతకు ఇంతకుముందే వచ్చినట్టుగా మొహానికి ఏదో స్కిన్ ప్రాబ్లం వచ్చిందని దాని చికిత్స చేయించుకోవడం కోసమే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

"""/" / అయితే లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యి బాధలో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా కూడా లేట్ అవుతుంది అని తెలిసి ఏం చేయాలో పాలు పోవడం లేదట.

ఈ సినిమాకు శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాలో సమంత లేకుండా విజయ్ దేవరకొండ మాత్రమే ఉన్న సీన్లు అన్నీ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి.

మరి సమంత ఎప్పుడు వస్తుందో మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి మరి.

నాకు ఏ సమస్య వచ్చినా ఆయననే పిలుస్తా.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!