జిల్లా ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి:పాలడుగు ప్రభావతి
TeluguStop.com
నల్లగొండ జిల్లాజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నెలకొన్న డాక్టర్ల,సిబ్బంది కొరత,మంచినీటి సౌకర్యం,ఓపి సేవల వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని :ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి( Paladugu Prabhavathi ) డిమాండ్ చేశారు.
మంగళవారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల( Pregnant Women ) వార్డులో మందుల కొరత ఏమీ లేదని,ప్రతిరోజు 350 మంది వరకు ఓపికి వస్తున్నారని,కేవలం ముగ్గురు డాక్టర్లు చూడడం వలన సమయం లేక గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మంచి నీటి సౌకర్యం లేదని అదనంగా నీటి ట్యాంకర్ ఏర్పాటు చేయాలన్నారు.గర్భిణీ స్త్రీలు, వృద్ధులు,వికలాంగులకు ఒకటే వరుస లైన్ ఓపి ఉండటం,గాలి వెలుతురు లేకపోవడం వలన కళ్ళు తిరిగి కిందపడిన సంఘటనలు జరిగాయని, నర్సుల,సిబ్బంది కొరత ఉందని రోగులు తెలియజేసినట్లు చెప్పారు.
గతంలో ఇచ్చిన తల్లి పిల్లలకు కిట్ ఇవ్వడం లేదని,రోగులకు పెట్టే ఆహారం నాణ్యతగా లేదన్నారు.
జిల్లా కలెక్టర్ వెంటనే హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగు పరిశీలన జరిపి సమస్యలను తక్షణమే పరిష్కారం చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ
కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ,జిట్టా సరోజ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ,సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన,జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.