గొర్రెల పంపిణి పథకం అమలుపై నిలీ నీడలు…!

నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వం గొర్లు ఇస్తామని నమ్మించి తమ దగ్గర డిడిలు కట్టించుకుని ఇవ్వకుండా మోసం చేసిందని,ఏడాదైనా నేటి వరకు అసలు గొర్రెల పంపిణీ పథకాన్ని( Telangana Sheep Distribution Scheme ) అమలు చేస్తారా లేదా చెప్పకుండా నేటి ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన గొల్ల కురుమలు ఆవేదన చెందుతున్నారు.

గత ప్రభుత్వంలో ఒక్క మిర్యాలగూడ( Miryalaguda ) నియోజకవర్గ పరిధిలో దాదాపు15 వందల మంది రూ.

43,750 చొప్పున డిడిలు కట్టారని,దాదాపు ఆరు కోట్ల పైచిలుకు సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరిందని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందే కానీ,గొల్ల కురుమలు మాత్రం అప్పులపాలయ్యారని, ముఖ్యంగా నేటి ప్రభుత్వం గొర్రెలు పంపిణి చేయకపోగా,డిడిలు కట్టిన కొందరికి ఈ మధ్యన తుతూమంత్రంగా రూ.

43750 చొప్పున అకౌంట్లలో జమ చేస్తుందన్నారు.ఈ నియోజకవర్గంలో యాదవుల ప్రాబల్యంతో రాజకీయాలు మారుతాయని,గొర్రెల పంపిణీ అమలు చేయకపొతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని అంటున్నారు.

డిడిలు కట్టిన ప్రతి రూపాయకి వడ్డీతో కలిపి తిరిగి అకౌంట్లలో జమ చేయాలని,లేనియెడల గొర్రెల పంపిణి చేయాలనిడిమాండ్ చేస్తున్నారు.

అప్పుతెచ్చి డిడి కట్టాను అయినా ఇంత వరకు గొర్రెలు రాలేదని దామరచర్ల మండలంరాజగట్టు బత్తుల నాగరాజు అన్నారు.

గత ప్రభుత్వం గొర్రెలను పంపిణి చేస్తామంటే వడ్డీకి అప్పు తెచ్చి డిడి కట్టాను.

తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగుతుంది.ఇప్పుడు మా పైసలు మాకేస్తే వడ్డీ ఎవరు కట్టాలి.

ప్రభుత్వం ఆలోచించి గొర్రెలు పంపిణీ చేయాలని అన్నారు.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. అసలేమైందంటే?