గ్రామ పంచాయతీ కార్మికులసమస్యలు పరిష్కరించాలి:సిఐటియు

యాదాద్రి భువనగిరి జిల్లా:గ్రామ పంచాయతీ కార్మికులకు( Gram Panchayat Workers ) ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం,గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బందెల భిక్షం డిమాండ్ చేశారు.

ఆదివారం రామన్నపేట మండలంమునిపంపులలో గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశానికి హాజరై మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాల్లో పారిశుద్ద్య సేవలందిస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలన్నారు.

సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపర్చాలన్నారు.అనంతరం నూతన గ్రామ పంచాయతీ కార్శికుల గ్రామ కమిటిని మండల అధ్యక్షుడు నకిరెకంటి రాము ప్రకటించారు.

అధ్యక్షుడిగా బూడిద ముత్తయ్య,కార్యదర్శిగా బూడిద మారయ్య, ఉపాధ్యక్షురాలిగా గాదె నర్సమ్మ,సహాయ కార్యదర్శిగా బూడిద కలమ్మ,సభ్యులుగా తుర్కపల్లి రాములు, బూడిద స్వామి, కానుకుంట్ల భారతమ్మ, వస్కుప్పల లక్ష్మమ్మ, బండారు లావణ్య,లక్ష్మమ్మ ను ఎన్నుకున్నారు.

బైక్ రైడర్లపై దాడి చేసిన ఎద్దు.. వీడియో చూస్తే గుండె గుబేల్..?