బురదదారే వారికి దిక్కు..బీసీ బాలుర వసతి గృహం విద్యార్థుల దుస్థితి

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణం( Nereducharla )లోని బీసీ బాలుర వసతి గృహం ఆవరణం మొత్తం బురదమయంగా మారడంతో విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చినుకు పడితే చాలు నీళ్ళు నిలిచ్చి చిన్నపాటి కుంటను తలపిస్తూ దోమలు,ఈగలు స్వైర విహారం చేస్తూ ఉండడంతో విద్యార్దులు రాత్రిపుట నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

బయటికి వెళ్ళాలంటే అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదని, బురద( Mud )లో నుండే ఇబ్బంది పడుతూ పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

గతంలో చుట్టుపక్కల ఇల్లు లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా వెళ్ళేదని, ప్రస్తుతం నూతన ఇల్లు నిర్మాణాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

వసతి గృహానికి డ్రైనేజీ సమస్య( Drainage Problem ) కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రోడ్డులో బిసి వసతి గృహం ఉన్న ఇండ్ల వరకు సీసీ రోడ్డు పోశారు.

వసతి గృహం వరకు మాత్రమే వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని,అంతవరకు సిసి రోడ్డు పోయకుండా ఎందుకు వదిలేసారో ఎవరికీ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే బీసీ వసతి గృహం రోడ్డు,హాస్టల్ ఆవరణలో కూడా సిసి వేయాలని,డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచాలని విద్యార్థులు కోరుతున్నారు.

బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?