టి‌ఆర్‌ఎస్ తో బి‌ఆర్‌ఎస్ కు చెక్.. వాట్ ఏ ప్లాన్ !

తెలంగాణ రాష్ట్ర సాధనకై కే‌సి‌ఆర్ గతంలో టి‌ఆర్‌ఎస్ పార్టీ ని స్థాపించిన సంగతి తెలిసిందే.

టి‌ఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అంటూ ప్రజల్లోకి వెళ్ళిన కే‌సి‌ఆర్ పెద్ద ఎత్తున ప్రజా మద్దతు కూడగట్టుకొని, తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ ను ఒక తిరుగులేని శక్తిగా మార్చారు.

ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం విడిపోయిన తరువాత.తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ తప్పా ఇతర పార్టీలకూ స్థానం లేదు అనెంతలా ప్రజామద్దతు టి‌ఆర్‌ఎస్ కు లభించింది.

తెలంగాణ అంటేనే టి‌ఆర్‌ఎస్ అనే భావనా దేశమంతా ఏర్పడిందటే ఆ పార్టీ ఇచ్చిన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేస్తుకోవచ్చు.

అలాంటి చరిత్ర కలిగిన టి‌ఆర్‌ఎస్ పార్టీ.ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ గా మారిన సంగతి తెలిసిందే.

"""/" / జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, మోడిని గద్దె దించాలని టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ గా మార్చారు కే‌సి‌ఆర్.

అయితే అయితే టి‌ఆర్‌ఎస్ బి‌ఆర్‌ఎస్ గా మారినప్పటికి కే‌సి‌ఆర్ పార్టీని ఇంకా టి‌ఆర్‌ఎస్ గానే గుర్తిస్తున్నారు ప్రజలు.

మరి అలాంటి పేరు గాంచిన టి‌ఆర్‌ఎస్ పార్టీ పేరుతోనే ప్రత్యర్థులు కే‌సి‌ఆర్ కు షాక్ ఇచ్చే ప్రణాళికలో ఉన్నారా ? అంటే అవుననే చెప్పవచ్చు.

కొత్తగా తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ పేరుతో ఓ రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు కారణం.

గతంలో కే‌సి‌ఆర్ కు కలిసొచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇప్పుడు ఇతరులు ఆ పేరుతో పార్టీ స్థపించడం కే‌సి‌ఆర్ ను కలవరపెట్టే అంశమే.

అయితే ఆ పార్టీ ఎవరిది.? ఆ పార్టీని ఎవరు నడిపించబోతున్నారు ? అనే విషయాలపై స్పష్టత లేనప్పటికి, ప్రస్తుతం తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

"""/" / ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ ( కొత్త పార్టీ ) పోటీ చేస్తే.

దాని ప్రభావం ఖచ్చితంగా బి‌ఆర్‌ఎస్ పైన పడే అవకాశం లేకపోలేదు.అయితే టి‌ఆర్‌ఎస్ ( కొత్త పార్టీ ) యొక్క గుర్తు, జెండా రంగు వంటి తదితర అంశాలపై ఇంక ఎలాంటి స్పష్టత లేదు.

ఒకవేళ గులాబీ రంగుతోనే టి‌ఆర్‌ఎస్ ను ఎన్నికల గారిలోకి దించితే మాత్రం.దాని ప్రభావం బి‌ఆర్‌ఎస్ పై గట్టిగానే పడుతుందని చెప్పక తప్పదు.

మరి వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్ ను ఎలాగైనా గద్దె దించాలని బిజెపి, కాంగ్రెస్ వంటి పార్టీలు అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో టి‌ఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు కూడా ఈ రెండు పార్టీల యొక్క వ్యూహంలో భాగమేనా ? అనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది.

ఏది ఏమైనప్పటికి సొంత పార్టీ పేరు ( టి‌ఆర్‌ఎస్ ) తోనే కే‌సి‌ఆర్ కు చిక్కులు తప్పెలా లేవు.

మరి దీని విషయంలో గులాబీ బాస్ ఏం చేస్తాడో చూడాలి.

అమానుషం.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టరమ్మ..