చ‌ల్ల‌గా ఉంద‌ని స్నానాన్ని స్కిప్ చేస్తున్నారా? అయితే ఈ తిప్ప‌లు త‌ప్ప‌వు!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌టం వ‌ల్ల ఎక్క‌డ్లేని బ‌ద్ధ‌కం మ‌న చుట్టూనే తిరుగుతుంటుంది.

ఆ బ‌ద్ధ‌కం కార‌ణంగా చాలా మంది స్నానాన్ని కూడా స్కిప్ చేస్తుంటారు.ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.

? రెండు రోజుల‌కు ఒక‌సారి స్నానం చేస్తున్నారా.? అయితే ఏరికోరి స‌మ‌స్య‌ల‌ను తెచ్చుకున్న‌ట్లే.

స్నానం చేయడం అనేది వ్యక్తిగత పరిశుభ్రత కోసమే కాదు.ఆరోగ్యానికి కూడా దాని వ‌ల్ల‌ ఎన్నో ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

అదే స్నానాన్ని స్కిప్ చేస్తే లేనిపోని తిప్ప‌లు తప్ప‌వ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో రోజుకు రెండు సార్లు త‌ప్ప‌కుండా స్నానం చేయాలి.లేదంటే అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

చర్మంపైన మృత కణాలు పేరుకొనే ప్రక్రియ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.ఆ మృత క‌ణాల‌ను స్నానం ద్వారా తొల‌గించ‌కుంటే.

శ‌రీరం నుండి దుర్వాస‌న రావ‌డం మొద‌లువుతుంది.మృత క‌ణాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల స్కిన్ ఇన్ఫెక్ష‌న్స్ కూడా త‌లెత్తుతాయి.

అలాగే బాహుమూలల్లో చెమట పట్టి మురికి దాంతో పాటు బ్యాక్టీరియా చేరుతూనే ఉంటాయి.

స్నానాన్ని స్కిప్ చేస్తే ఆ బ్యాక్టీరియా వ‌ల్ల అలర్జీలు, దురద, ర్యాషెస్ త‌దిత‌ర‌ చర్మ సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి.

రోజూ స్నానం చేయ‌కుంటే బ‌ద్ధ‌కం మ‌రింత పెరిగిపోతుంది.ఏ ప‌నీ స‌క్ర‌మంగా చేయ‌లేక‌పోతుంటారు.

రాత్రుళ్లు నిద్ర కూడా స‌రిగ్గా ప‌డ్డాదు. """/"/ అందుకే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్నా, లేకున్నా.

రోజు ఉద‌యం, సాయంత్రం త‌ప్ప‌కుండా స్నానం చేయాలి.రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే గ‌నుక‌.

ఒత్తిడి ప‌రార్ అవుతుంది.రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

రోగనిరోధక శక్తిని బలప‌డుతుంది.శరీరం మరియు మనస్సు ఉత్సాహంగా ప‌ని చేస్తాయి.

రాత్రుళ్లు చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంది.జీర్ణ శక్తి సైతం రెట్టింపు అవుతుంది.

Validation Check 2026-03-24 19:38:18