హన్మకొండలో “వాల్తేరు వీరయ్య” వేడుకలో అపశృతి..!!

మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా నటించడం జరిగింది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన "వాల్తేరు వీరయ్య" బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది.

ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో నిర్వహించడం తెలిసిందే.

అయితే తాజాగా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో విజయోత్సవ వేడుక నిర్వహించారు.

ఈ వేడుకలో తొక్కిసలాట జరిగింది.ఒక్కసారిగా గేట్లను తోసుకునీ ముందుకు రావడంతో పోలీసులు అభిమానుల మధ్య తోపులాట జరిగింది.

ఈ ఘటనలో పలువురు చిరంజీవి అభిమానులు సైతం  గాయపడటం జరిగిందంట.గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉండటం జరిగింది.

దీంతో హుటాహుటిన అక్కడ ఉన్న భద్రత సిబ్బంది చిన్నారులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

విశాల్ సినిమాకు భారీ షాకిచ్చిన తెలుగు ప్రేక్షకులు.. అక్కడే తప్పు జరిగిందా?