నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సీరియల్ హీరోయిన్..!

స్టార్ మాలో మౌనరాగం సీరియల్ తో పాపులర్ అయిన సీరియల్ హీరోయిన్ ప్రియాంకా జైన్ ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.

అంతకుముందే గోలీసోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమారా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన ప్రియాంకా జైన్ మౌనరాగం ద్వారా పాపులర్ అయ్యింది.

ఇక ఆ సినిమాతో ఆమె క్రేజ్ పెరిగింది.ఇక ఇప్పుడు సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్సులు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గా కింగ్ నాగార్జున సినిమాలో అమ్మడికి ఛాన్స్ వచ్చినట్టు టాక్.నాగార్జున బంగార్రాజు తర్వాత చేస్తున్న సినిమాలో ప్రియాంక జైన్ కు సిస్టర్ రోల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

సీరియల్స్ ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక జైన్ ఇక మీదట సినిమాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తుంది.

ఈ క్రమంలో వచ్చిన నాగ్ సినిమా ఆఫర్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

అంతకుముందు ఆమెకు ఎలాంటి ఐడెంటిటీ లేదు కాబట్టి గుర్తించలేదు కాని ఇప్పుడు సినిమాల్లో ఆమె చేస్తే తప్పకుండా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

నాగార్జున సినిమా ఛాన్స్ అంటే ప్రియాంకా జైన్ వెరీ లక్కీ అని చెప్పొచ్చు.

ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది.. ఓవరాక్షన్ చేసిన పరాగ్