కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ ?

జాతీయస్థాయిలో కాంగ్రెస్ ను ముందుకు నడిపించే బలమైన నాయకత్వం కోసం ఆ పార్టీ చూస్తోంది.

సోనియా సారథ్యంలోనే 2024 ఎన్నికలకు కాంగ్రెస్ వెళుతుందని అంతా భావించినా.రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించి ఆయన ఆధ్వర్యంలోనే బిజెపి ఎదుర్కొంటారని ఇప్పటివరకు హడావుడి కాంగ్రెస్ పార్టీలో నడిచింది.

అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడం, ఎన్నికల సమయం దగ్గర కు వస్తుండడంతో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు అనేది ఆ పార్టీ నాయకులకు ఉత్కంఠ కలిగిస్తోంది.

గతంలో మాదిరిగా నాన్చుడు ధోరణితో వ్యవహరించకుండా , అనేక కీలక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.

ముఖ్యంగా రాజస్థాన్ లోని చింతన్ శిబిర్ లో జరిగిన కాంగ్రెస్ ముగింపు సమావేశాల్లో అనేక కీలక అంశాలపై.

కీలక నిర్ణయాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకుంది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పార్టీ ప్రక్షాళనకు అనేక కీలక నిర్ణయాలను సూచించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపించింది.

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు రాహుల్ అంతగా ఆసక్తి చూపించకపోవడం తో.ప్రియాంకను కొత్త అధ్యక్షురాలిగా ప్రకటిస్తేనే కాంగ్రెస్ లో ఉత్సాహం వస్తుందనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా కొంతమంది కీలక నాయకులు వ్యక్తం చేశారు.

అయితే ప్రస్తుతం ఈ అంశం గురించి ఎవరు మాట్లాడవద్దని, ఇది అజెండాలో లేని అంశమని కమిటీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే సూచించారు.

సోనియా తర్వాత ప్రియాంక గాంధీనే సమర్డురాలు అని, ఆ సమావేశంలో పాల్గొన్న చాలామంది నాయకులు అభిప్రాయపడడంతో ఈ అంశం పైన ఈ సందర్భంగా జోరుగా చర్చ జరిగింది.

/br """/"/ ఇక ఈ విషయంలో సోనియా సైతం ప్రియాంక గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లు గా కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉండడంతో దాదాపు ఆమె పేరే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది.

దీనికి తగ్గట్లుగానే గతంతో పోలిస్తే ప్రియాంక బాగా యాక్ట్ అయ్యారు.పార్టీ కార్యక్రమాలలోనూ, సమావేశాలలోను పాల్గొంటూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

దీంతో ఈమె పేరు ఇప్పుడు మారుమోగుతోంది.

బాలయ్య రామ్ చరణ్ అండ తో శర్వానంద్ హిట్టు కొట్టబోతున్నాడా..?