పెళ్లికి ముందు ప్రియాంకకు భర్తతో ఒప్పందం. అదేమిటంటే..?
TeluguStop.com
కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి ప్రియాంకా చోప్రా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
క్రిష్, ఓం శాంతి ఓం సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
2018 సంవత్సరంలో ప్రియాంక చోప్రాకు అమెరికన్ సింగర్ నిక్ జోనస్ తో వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్యంగా ఉంటూ తమ జీవితాలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంకా చోప్రా పెళ్లికి ముందు నిక్ జోనస్ తో ఒక ఒప్పందం చేసుకున్నానని ఆ ఒప్పందం గురించి అభిమానులకు తెలిసేలా చేశారు.
తను హీరోయిన్, భర్త సింగర్ కావడంతో వేర్వేరు దేశాలకు వెళ్లాల్సి ఉంటుందని.అందువల్ల ప్రతి నెలా చివరి వారంలో ఎక్కడ ఉన్నా కలిసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
అలా నియమం పెట్టుకోకపోతే ఒకరికి మరొకరు సమయం కేటాయించే అవకాశం లేకపోవచ్చని ఆమె అన్నారు.
"""/"/
ప్రస్తుతం ప్రియాంక లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు.అక్కడ ఉండటం వల్ల తాను భారతీయ వంటకాలను మిస్ అవుతున్నానని ఆమె అన్నారు.
తనకు రోటీ, దాల్ అంటే చాలా ఇష్టమని.తన భర్త నిక్ పన్నీర్ ఐటంను ఇష్టపడతాడని తెలిపారు.
కబాబ్, చాట్, బిర్యానీలను కూడా తాను ఇష్టపడతానని ఆమె తెలిపారు.ప్రియాంక నటించిన వైట్ టైగర్ సినిమా ప్రమోషన్స్ తో ప్రియాంక తీరిక లేకుండా గడుపుతున్నారు.
2018 సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రియాంక, నిక్ వివాహం జరిగింది.క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం నిక్ ప్రియాంకల వివాహం జరిగింది.
ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ టెక్ట్స్ ఫర్ యూ లో ప్రియాంక భర్త నిక్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
నిక్, ప్రియాంక చోప్రా కలిసి నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.