ప్రియాంక చోప్రా ధరించిన ఈ జాకెట్ ధర ఎంతంటే?

ప్రియాంక చోప్రా తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.తన అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించిన ఈ భామ బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది.

అయితే అమెరికన్ పాపులర్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమ వివాహం చేసుకొని బాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి హాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది.

హాలీవుడ్ లో క్వాంటికా సిరీస్-1, సిరీస్ -2 లలో నటించి హాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అందుకొని తన సత్తాను హాలీవుడ్ లో కూడా చాటింది.

అయితే ప్రియాంక చొప్రా తాజాగా ఓ హోటల్ ను స్థాపించిన విషయం తెలిసిందే.

అంతేకాక ప్రియాంక చోప్రా తీసుకున్న ఓ ఖరీదైన ఇల్లు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ప్రియాంక చోప్రాకు సంబంధించి మరొక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా బ్రిటన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అవార్డుల వేడుక కు హాజరైన ప్రియాంక తాను ధరించిన స్టన్నింగ్ డ్రెస్ తో తన భర్త నిక్ జోనస్ తో కలిసి హాజరైన ప్రియాంక ఒక్కసారిగా ఈ అవార్డుల వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మామూలుగానే ప్రియాంక డ్రెస్ లపై ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.అయితే ఇప్పుడు కూడా ఎప్పటిలాగే ప్రియాంక వేసుకొచ్చిన రెడ్ జాకెట్ పై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

అయితే రెడ్ జాకెట్ ధర ఎంతో తెలిసి నెటిజన్లు షాక్ కు గురవడం వారి వంతయింది.

ఆ రెడ్ జాకెట్ ధర మూడు లక్షల 52 వేల రూపాయలు.

తేజ సజ్జా జై హనుమాన్ సినిమాలో ఉంటాడా..?