బాలీవుడ్ ప్రియాంక తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?
TeluguStop.com
ప్రియాంక చోప్రా.ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్.
అంతేకాదు.పలు హాలీవుడ్ మూవీస్‌లో బిజీ బిజీగా గడుపుతోంది ఈ జెమ్‌షేడ్‌పూర్ బ్యూటీ.
1982 జూలై 18న పుట్టిన ఈ బ్యూటీ తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్మీ డాక్టర్లే.
తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దేశంలోనే ఎన్నో ప్రాంతాలకు వెళ్లేవారు.అందుకే దేశంలోని పలు ప్రాంతాలను చిన్నప్పుడే చూసింది ప్రియాంక.
18 ఏండ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది.అక్కడే ఉన్న తన బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంది.
క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు సింగింగ్ కూడా నేర్చుకుంది.ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది ప్రియాంక.
ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.అదే ఉత్సాహంతో మిస్ వరల్డ్ పోటీల్లోనూ పార్టిసిపేట్ చేసింది.
ఏకంగా టైటిల్ కొట్టేసింది.ఇక సినీ ఆఫర్లు ఆమె ముందు వచ్చి వాలాయి.
హిందీలో తొలిసారిగా హమ్‌రాజ్ అనే సినిమా ఆఫర్ వచ్చింది.బాబీ డియోల్, అక్షయ్ కన్నా హీరోలుగా నటించారు.
ఎందుకో చివరి క్షణంలో ఆ అవకాశం చేజారింది.ప్రియాంక ప్లేస్ లో అమిషా పటేల్ నటించారు.
అదే సమయంలో తమిళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు అవకాశం వచ్చింది.హీరో విజయ్‌తో కలిసి తమిళం అనే సినిమాలో నటించారు.
2002 ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమానే ప్రియాంక కెరీర్‌లో తొలి సినిమా. """/"/
అదే సమయంలో పలువురు తెలుగు సినిమా నిర్మాతల దృష్టి ఆమె మీద పడింది.
ఎంతో మంది నిర్మాతలు ఆమెతో సినిమా తీసేందుకు ప్రయత్నించారు.నెక్కంటి శ్రీదేవి మాత్రం ఆమె డేట్స్ దక్కించుకున్నారు.
2002లో మొదలైన ఆచిత్రం పేరు అపురూపం.సాయిరవి డైరెక్షన్‌లో ప్రసన్న హీరోగా ఈ చిత్రం మొదలైంది.
సగం పూర్తయిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయింది.ఆ సినిమా రిలీజ్ అయితే ప్రియాంక తెలుగు సినీ ఇండస్ట్రీకే పరిమితం అయ్యేదేమో! ఈ సినిమా ఆగిపోవడంతో బాలీవుడ్ అవకాశాలను పొందారు.
హిందీ పరిశ్రమలో వెనక్కి చూసుకోకుండా దూసుకెళ్లారు.తన అందచందాలతో పాటు అభినయంతో అతికొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగారు.
జాతీయ స్థాయి అవార్డులను సైతం అందుకున్నారు.అనంతరం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకున్నారు.
ప్రస్తుతం ఆమె నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్నారు./p.
శివయ్య భక్తిలో టాలీవుడ్ హీరోయిన్లు.. శివుడి నామాలతో కనిపించిన హీరోయిన్లు వీళ్లే!