అలా చేయకపోతే గ్యాంగ్ రేప్ చేస్తామంటూ స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు.. కానీ…

సినిమా రంగం అనేది యూనివర్సల్.ఇందులో భాగంగా నటీనటులు ఏ బాష, దేశానికి చెందినప్పటికీ ప్రపంచంలో తమ నటనా ప్రతిభను ఎక్కడైనా సరే నిరూపించుకునే నటించే అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలో కొందరు నటీనటులు అసభ్యకర సంఘటనలను ఎదుర్కొంటుంటారు.అయితే బాలీవుడ్ లోనే కాకుండా పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ "ప్రియాంక చోప్రా" గురించి దేశ వ్యాప్తంగా తెలియనివారుండరు.

అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, సినీ జీవితంలో జరిగినటువంటి పలు సంఘటనలను పొందుపరుస్తూ "అన్ ఫినిష్డ్" అనే పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 అయితే ఈ పుస్తకంలో ప్రియాంక చోప్రా అమెరికాలో తాను జాతి వివక్షను ఎదుర్కున్నానని తెలిపింది.

 అంతేకాక తాను విడుదల చేసిన ఆల్బమ్ మంచి విజయం సాధించడంతో ఎంతో మంది తనకు ప్రశంసలు తెలిపారని, కానీ కొందరు మాత్రం ఏకంగా ఈ దేశాన్ని వదిలి పెట్టి వెళ్ళిపో.

  లేకపోతే నీపై సామూహిక అత్యాచారం చేస్తామంటూ బెదిరించినట్లు కూడా ప్రియాంక చోప్రా పుస్తకంలో తెలిపింది.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

మరికొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ఒక్కోసారి మన జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతమాత్రాన నడవడం ఆపేస్తే అక్కడితోనే ఆగిపోతామని ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ తమ మద్దతును తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత ప్రియాంక చోప్రా సినిమాల పరంగా కొంత మేర తగ్గించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే ప్రియాంక చోప్రా బాలీవుడ్ ప్రముఖ హీరో రాజ్ కుమార్ రావు తో కలిసి "ది వైట్ టైగర్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

 కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రియాంక చోప్రా తన తదుపరి చిత్ర కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

డైరెక్టర్ శంకర్ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న ఇండియన్3 మూవీ.. ఏం జరిగిందంటే?