దీపావళి రోజు న్యూయార్క్ లో సెలవు హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక చోప్రా..!!
TeluguStop.com
ఇండియాలో అతిపెద్ద పండుగలలో ఒకటి దీపావళి.భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ నాడు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి.
బాణాసంచ కాలుస్తారు.చెడుపై మంచిని గెలిచే అభివర్ణించే పండుగగా జరుపుకుంటారు.
అయితే ఈ పండుగకు అగ్ర దేశం అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో అక్కడ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బాలీవుడ్ నటి మరియు నిర్మాత ప్రియాంక చోప్రా జొనస్ సంతోషం వ్యక్తం చేసింది.
"""/"/
2023 నుండి ప్రతి సంవత్సరం దీపావళి రోజునా సెలవు ఉంటుందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటనపై ప్రియాంక చోప్రా ఈ రీతిగా స్పందించారు.
తన చిన్నతనంలో న్యూయార్క్ లోని క్వీన్స్ లో పాఠశాలలకు వెళ్ళినప్పటి రోజులను గుర్తుకు చేసుకుని ఏడ్చేసానని తెలిపింది.
న్యూయార్క్ నగరంలో సుమారు రెండు లక్షల మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులున్నారు.
వీళ్లంతా దీపావళి పండుగను జరుపుకుంటారని అందుకే సెలవు ప్రకటన నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలియజేయడం జరిగింది.
అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ అధికార నివాసంలో దీపావళి వేడుకలు కూడా ఇటీవల జరిగాయి.
ఏది ఏమైనా భారతదేశంలో అతిపెద్ద పండుగ దీపావళిని అమెరికన్లు కూడా జరుపుకోవటం పట్ల భారతీయులు చాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 పరిస్థితి ఏంటి..? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది…