మాస్ మహారాజ్ రవితేజకి గత కొంత కాలంగా ఫ్లాప్ లు వస్తున్నాయి.రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సాలిడ్ హిట్ రాలేదు.
అయినా కూడా గ్యాప్ లేకుండా సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేసుకొని వెళ్తున్నారు.
ఈ సారి రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ అని కాకుండా కాస్తా కొత్తదనం ఉన్న కథలకి కూడా రవితేజ ఓటు వేస్తున్నాడు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు.పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రవితేజ చేస్తున్న ఐదో సినిమా ఇది కావడం విశేషం.
అతను పోలీస్ ఆఫీసర్ గా చేసిన వాటిలో ఇప్పటి వరకు మూడు సినిమాలు సూపర్ హిట్.
ఈ సారి కూడా పవర్ ఫుల్ క్రాక్ పోలీస్ గా రవితేజ అలరించబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా రవితేజ చేస్తున్నాడు.
ఈ సినిమాలో రవితేజ దొంగగా కనిపించబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలో డింపుల్ హయాతీ, సాక్షి అగర్వాల్ హీరోయిన్లుగా ఫైనల్ అయినట్లు చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది.
అయితే ఇప్పుడు కొత్తగా ఈ సినిమా కోసం మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది.
గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ప్రియాంక అరుళ్ మోహన్ ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తుంది.
తెలుగులో గ్యాంగ్ లీడర్ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం అనే సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పుడు రవితేజతో జత కట్టే అవకాశం కూడా సొంతం చేసుకుందని ప్రచారంలో ఉంది.
అయితే చిత్ర యూనిట్ ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.మరి ఇందులో వాస్తవం ఎంత తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే వరకు వేచి చూడాలి.
హైపర్ ఆది నన్ను ఫ్లర్ట్ చేశాడు.. వైరల్ అవుతున్న దీపు నాయుడు షాకింగ్ కామెంట్స్!